నెల్లూరు నగరంలో బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం ఉదయం వరకు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలతోపాటు అండర్ బ్రిడ్జిల్లో వర్షపు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రహదారులపై నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఉద్యోగం, ఇతర పనుల నిమిత్తం బయటకు వచ్చిన ప్రజలు వర్షపు నీటిలో
ప్రయాణించేందుకు అవస్థలు పడ్డారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరు


