ఎస్జీఎఫ్‌ జిల్లా స్థాయి ఎంపికలు రేపు | - | Sakshi
Sakshi News home page

ఎస్జీఎఫ్‌ జిల్లా స్థాయి ఎంపికలు రేపు

Nov 6 2026 2:02 AM | Updated on Nov 6 2026 2:02 AM

నెల్లూరు(టౌన్‌): స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ (ఎస్జీఎఫ్‌) నాలుగో విడత జిల్లా స్థాయి క్రీడా ఎంపికలు ఈనెల 7వ తేదీన నిర్వహించనున్నట్లుగా స్కూల్‌ గేమ్స్‌ కార్యదర్శి మల్లికార్జున గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్చరీ అండర్‌ – 14, 17, 19, బ్యాడ్మింటన్‌ అండర్‌ – 17, 19, బేస్‌బాల్‌, బీచ్‌ వాలీబాల్‌, స్విమ్మింగ్‌ అండర్‌ – 14, 17, 19 విభాగాల్లో బాలబాలికలకు నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఎంపికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సాఫ్ట్‌ టెన్నిస్‌ అండర్‌ – 14, 17, 19 విభాగాల బాలబాలికల ఎంపికలు ఇందుకూరుపేటలోని ఎంకేఆర్‌ ఉన్నత పాఠశాలలో జరుగుతాయని తెలియజేశారు.

రోడ్డు ప్రమాదంలో

ఆరుగురికి గాయాలు

● తప్పిన పెను ప్రమాదం

ముత్తుకూరు: మండలంలోని మల్లూరు మెయిన్‌ రోడ్డు సెంటర్లో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. ముత్తుకూరు నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న ప్యాసింజర్‌ ఆటోకు ఒక్కసారిగా గేదెలు అడ్డుగా రావడంతో డ్రైవర్‌ వాటిని తప్పించేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆటో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కారును ఢీకొని బోల్తా పడింది. ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను సురక్షితంగా బయటకు తీసి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

పీఓలు, పోలింగ్‌

ఉద్యోగులకు సెలవు నేడు

నెల్లూరు(పొగతోట): జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియలో పాల్గొన్న పీఓలు, ఏపీఓలు, ఇతర ఉద్యోగులకు శుక్రవారం ప్రత్యేక సెలవు ప్రకటిస్తూ కలెక్టర్‌ హిమాన్షు శుక్లా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల విధులకు హాజరైన ఉద్యోగులు మరుసటి రోజు డ్యూటీకి హాజరుకాని పక్షంలో దానిని ఆన్‌ డ్యూటీగా (ఓడీ)గా పరిగణించాల్సి ఉంది.

ఓట్ల లెక్కింపుపై శిక్షణ

పోలింగ్‌ ప్రక్రియ ముగిసింది. ఈనెల 7వ తేదీన ఓట్లు లెక్కించనున్నారు. 6 స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద ఈ ప్రక్రియ జరుగుతుంది. లెక్కింపులో పాల్గొనే అధికారులు, ఉద్యోగులకు శుక్రవారం శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

బాణసంచా

దుకాణాలకు లక్కీడిప్‌

నెల్లూరు సిటీ: నెల్లూరు ఆర్డీఓ కార్యాలయంలో గురువారం బాణసంచా దుకాణాల కేటాయింపు కోసం లక్కీడిప్‌ను నిర్వహించారు. నగరంలోని వీఆర్సీ మైదానంలో 47, ఎస్‌వీజీఎస్‌ మైదానంలో రెండు క్లస్టర్లలో 52 లెక్కన, నవాబుపేటలోని మార్కెట్‌ యార్డ్‌లో 53 దుకాణాల ఏర్పాటుకు లాటరీ తీశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ కేటాయించిన మైదానాల్లో మూడురోజులు మాత్రమే దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వ్యాపారులందరూ అగ్నిమాపక, భద్రతా పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలని పేర్కొన్నారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. నిర్దేశించిన మైదానాలు తప్ప వేరేచోట్ల దుకాణాలు ఏర్పాటు చేస్తే, సంబంధిత శాఖల ద్వారా వాటిని వెంటనే తొలగిస్తామన్నారు. కార్యక్రమంలో నెల్లూరు అర్బన్‌ ఇన్‌చార్జి తహసీల్దార్‌ వెంకటలక్ష్మి, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement