వైఎస్సార్‌సీపీ నేతల గృహ నిర్బంధం | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ నేతల గృహ నిర్బంధం

Nov 6 2026 2:02 AM | Updated on Nov 6 2026 2:02 AM

● టీడీపీ నేతల దౌర్జన్యాలను పట్టించుకోని

పోలీసులు

చిట్టమూరు: స్థానిక సంస్థల ఎన్నికల్లో పచ్చమూక దాడులు, దౌర్జన్యాలు, బెదిరింపులకు పాల్పడింది. మండల పరిధిలోని మెట్టు గ్రామంలో టీడీపీ నేతల ప్రోద్బలంతో వైఎస్సార్‌సీపీ నేత పుచ్చలపల్లి నరేష్‌రెడ్డి ఇంటికి పోలీసులు వెళ్లి నోటీసు ఇచ్చి బయటకు రావొద్దని గృహ నిర్బంధం చేశారు. అలాగే ఆయన కుమారుడు పుచ్చలపల్లి విష్ణురెడ్డికి కూడా నోటీస్‌ ఇచ్చి పోలీస్‌స్టేషన్‌కు రావాలని బెదిరింపులకు దిగారు. చిట్టమూరు పోలింగ్‌ కేంద్రానికి వైఎస్సార్‌సీపీ మండలాధ్యక్షుడు సన్నారెడ్డి శ్రీనివాసులురెడ్డిని రానివ్వకుండా టీడీపీ మూక బెదిరించింది. దీంతో కొంతసేపు అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది. ఆరూరు గ్రామంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు తెలుగు తమ్ముళ్లు వైఎస్సార్‌సీపీ నేతలపై కవ్వింపు చర్యలకు దిగారు. ఎక్కడ ఓడిపోతామోనని గొడవలకు దిగారు. ఇరు వర్గాలు పరస్పరం వాగ్వాదానికి దిగడంతో పోలీసులు సర్దుబాటు చేశారు. టీడీపీ ముఖ్యనేతలు మాత్రం మండలంలోని 12 ఎంపీటీసీ సెగ్మెంట్లలో యథేచ్ఛగా తిరుగుతూ తమకు ఓటు వేయాలని చెబుతున్నా పోలీసులు పట్టించుకోకపోవడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement