దుస్థితిలో మహిళా పాలిటెక్నిక్‌ కళాశాల | - | Sakshi
Sakshi News home page

దుస్థితిలో మహిళా పాలిటెక్నిక్‌ కళాశాల

Nov 6 2026 2:02 AM | Updated on Nov 6 2026 2:02 AM

● ప్రిన్సిపల్‌ గదిలోకి వాన నీరు

నెల్లూరు(టౌన్‌): నగరం నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌ కళాశాలను వర్షపు నీరు ముంచెత్తింది. గురువారం తెల్లవారుజాము నుంచి కురిసిన భారీ వర్షానికి కళాశాల ప్రాంగణమంతా నీటితో నిండిపోయింది. ప్రిన్సిపల్‌ గది, సిబ్బంది గదులు, తరగతి గదుల్లోకి నీరు చేరడంతో రికార్డులు పూర్తిగా తడిసిపోయాయి. ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రికల్‌, కంప్యూటర్‌ పరికరాలు కూడా దెబ్బతిన్నట్లు తెలిసింది. పురాతన భవనం కావడంతో హాస్టల్లో ఉంటున్న విద్యార్థినులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏ గోడ ఎప్పుడు కూలుతుందోనన్న ఆందోళనతో బిక్కుబిక్కుమంటూ గడిపిన పరిస్థితి ఉంది. పరిస్థితుల దృష్ట్యా కళాశాలకు సెలవు ప్రకటించారు. ప్రథమ సంవత్సరానికి చెందిన ఎక్కువ మంది విద్యార్థినులు హాస్టల్లోనే ఉంటుండగా, ద్వితీయ, తృతీయ సంవత్సరాల విద్యార్థినులు సమీపంలోని పీజీల్లో ఉంటున్నట్లు చెబుతున్నారు. కళాశాల ప్రాంగణంలో కొత్త భవనం నిర్మించి, పాత భవనాన్ని తొలగించాలని పలుమార్లు విన్నవించినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు కళాశాలను సందర్శించి కొత్త భవన నిర్మాణానికి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement