మాజీ ఎంపీపీ కుమారుడిపై దాడి | - | Sakshi
Sakshi News home page

మాజీ ఎంపీపీ కుమారుడిపై దాడి

Nov 6 2026 2:02 AM | Updated on Nov 6 2026 2:02 AM

● టీడీపీ గూండాల నిర్వాకం ● గాయాలతో ఆస్పత్రిలో చికిత్స

ముత్తుకూరు: వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీపీ గండవరం సుగుణ కుమారుడు దినేష్‌ సుబ్రహ్మణ్యంపై తెలుగుదేశం గూండాలు దాడికి తెగబడ్డారు. గురువారం ముత్తుకూరులో నిర్వహించిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో భాగంగా దినేష్‌ పోలింగ్‌ కేంద్రం వద్ద ఉండగా టీడీపీకి చెందిన రౌడీలు దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరిచారు. గాయపడిన దినేష్‌ను పార్టీ నాయకులు, కార్యకర్తలు బయటకు తీసుకొచ్చి వెంటనే చికిత్స నిమిత్తం నెల్లూరు అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నాడు.

ఓటమి భయంతోనే దాడులు

ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే టీడీపీ ఎంపీపీ అభ్యర్థి రామ్మోహన్‌రెడ్డి తన కుమారుడిపై దాడి చేయించినట్టుగా సుగుణ, సూరి ఆరోపించారు. వారు మాట్లాడుతూ రామ్మోహన్‌రెడ్డి పిరికిపందలా ఎన్నికల్లో విజయం సాధించలేక దినే ష్‌పై దాడులకు తెగబడినట్టు విమర్శించారు. దుర్మార్గపు పాలన అంతం కావడానికి ఎన్నోరోజులు పట్టదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement