కట్టుకున్నోడే కాలయముడు | - | Sakshi
Sakshi News home page

కట్టుకున్నోడే కాలయముడు

Nov 5 2026 12:16 AM | Updated on Nov 5 2026 12:16 AM

● మద్యం మత్తులో భార్యను కర్రతో కొట్టి

చంపిన భర్త

● అనుమానమే కారణం

గూడూరురూరల్‌: జీవితాంతం తోడు ఉంటానని తాళి కట్టిన వ్యక్తి ఆమె పాలిట యముడయ్యాడు. అనుమానం పెంచుకుని కర్రతో కొట్టి ప్రాణాలు తీశాడు. గూడూరు మండలం వెడిచెర్ల గ్రామంలోని ఎస్టీ కాలనీలో బుధవారం మధ్యాహ్నం ఆదూరి శైలజ (30) అనే మహిళను భర్త ముని కృష్ణయ్య హత్య చేశాడు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. 15 సంవత్సరాల క్రితం శైలజతో మునికృష్ణయ్యకు వివాహమైంది. వీరికి 2, 4 సంవత్సరాలు వయసున్న ఇద్దరు కుమారులున్నారు. అయితే భార్యపై అనుమానంతో భర్త తరచూ గొడవపడేవాడు. ఈ క్రమంలో బుధవారం మద్యం మత్తులో ఉన్న మునికృష్ణయ్య శైలజ తలపై కర్రతో కొట్టడంతో తీవ్ర రక్తగాయాలతో అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయింది. బాధిత తండ్రి ఆదూరి చెంచు కృష్ణయ్య రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement