నిర్భయంగా ఓటేయండి | - | Sakshi
Sakshi News home page

నిర్భయంగా ఓటేయండి

Nov 5 2026 12:16 AM | Updated on Nov 5 2026 12:16 AM

చేజర్ల: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును ప్రజలు నిర్భయంగా వినియోగించుకోవాలని ఎస్పీ అజిత వేజెండ్ల సూచించారు. మండలంలో ఎన్నికల ఏర్పాట్లు, డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాన్ని బుధవారం ఆమె పరిశీలించారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను ఆరాతీసి సిబ్బందికి పలు సూచనలు చేశారు. రౌడీ షీటర్లు, అనుమానిత వ్యక్తులను బైండోవర్‌ చేయాలని ఆదేశించారు. ప్రతి కేంద్రం వద్ద 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని.. పార్టీల నేతలు, ఏజెంట్లు సహకరించి ఎన్నికలు సజావుగా జరిగేలా తోడ్పడాలని కోరారు. సంగం సీఐ శ్రీనివాసులురెడ్డి, ఎస్సై అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు.

పీఓ, ఏపీఓల తీరుపై ఆగ్రహం

కావలి: కావలి మండల పరిషత్‌ ఎన్నికలకు సంబంధించిన పీఓలు, ఏపీఓలు వ్యవహరించిన తీరుపై డిప్యూటీ సీఈఓ బ్రహ్మయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయానికి విచ్చేసిన వీరు డ్యూటీకి హాజరైనట్లు రిజిస్టర్‌లో సంతకాలు పెట్టి ఆ తర్వాత పత్తా లేకుండా పోయారు. ఫలితంగా ఎన్నికల సామగ్రిని సిబ్బంది తీసుకోవడంలో ఆలస్యమైంది. ఈ విషయాన్ని తెలుసుకున్న బ్రహ్మయ్య మండిపడ్డారని సమాచారం. వీరిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నారు. రిజర్వ్‌ స్టాఫ్‌ను అప్పటికప్పుడు సిద్ధం చేసి తరలించారని తెలుస్తోంది.

ఫిరాయింపుదారులకు భంగపాటు

ఆత్మకూరు: స్థానిక మున్సిపాల్టీకి సంబంధించి 2021లో నిర్వహించిన ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున గెలుపొంది.. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీలోకి ఫిరాయించిన వారికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పి సాగనంపారు. తొమ్మిదో వార్డు నుంచి పుచ్చలపల్లి రాధిక.. 19వ వార్డులో బరిలోకి దిగిన మాజీ వైస్‌ చైర్మన్‌ సర్దార్‌.. 20వ వార్డులో పోటీ చేసిన గంధళ్ల వేణు ఘోరంగా ఓటమి పాలయ్యారు. ఆదరించిన పార్టీకి వెన్నుపోటు పొడిచిన వీరికి సరైన గుణపాఠం లభించిందనే భావన పలువురిలో వ్యక్తమవుతోంది.

శ్రీవారి దర్శనానికి

ఆరు గంటలు

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ బుధవారం సాధారణంగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని నాలుగు కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారిని 72,806 మంది మంగళవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాల ను 18,564 మంది అర్పించారు. కానుకల రూ పంలో హుండీలో రూ.3.63 కోట్లను సమర్పించారు. టైమ్‌ స్లాట్‌ టికెట్లున్న వారికి సకాలంలో దర్శనమవుతోంది. ఇవి లేని వారికి ఆరు గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లున్న వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు.

డిప్యూటీ మేయర్‌ ఎన్నికకు 18న నోటిఫికేషన్‌

నెల్లూరు(బారకాసు): నెల్లూరు కార్పొరేషన్‌ డిప్యూటీ మేయర్‌ ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఈ నెల 18న జారీ చేయనున్నామని రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఎన్నికను 23న నిర్వహించనున్నామని వెల్లడించింది.

8న జిల్లాస్థాయి

స్విమ్మింగ్‌ జట్ల ఎంపిక

నెల్లూరు (టౌన్‌): జిల్లా స్థాయి స్విమ్మింగ్‌ జట్లను నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో గల స్విమ్మింగ్‌ పూల్లో ఈ నెల ఎనిమిదిన ఎంపిక చేయనున్నామని అసోసియేషన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సనత్‌కుమార్‌, మధు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికలకు హాజరయ్యే వారు ఆధార్‌ కార్డు, వయస్సు ధ్రువీకరణ పత్రంతో ట్రెజరర్‌ శంకరరెడ్డి వద్ద పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. రెండో సబ్‌ జూనియర్స్‌ ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ రాష్ట్రస్థాయి ఆక్వాటిక్‌ పోటీలను విశాఖపట్నంలో ఈ నెల 14 నుంచి నిర్వహించనున్నారని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement