పల్లెపోరు నేడు | - | Sakshi
Sakshi News home page

పల్లెపోరు నేడు

Nov 5 2026 12:16 AM | Updated on Nov 5 2026 12:16 AM

● జెడ్పీటీసీ, ఎంపీటీసీ

ఎలక్షన్లకు సర్వం సిద్ధం

● ఉదయం ఏడు నుంచి ప్రారంభం

● జెడ్పీలో మీడియా సెంటర్‌

పోలింగ్‌ కేంద్రాలు 1568

ఓటర్లు

12,85,840 మంది

ఎన్నికలు జరిగే

మండలాలు

34

విధుల్లో ఉన్న

ఉద్యోగులు 10,800

నెల్లూరు(పొగతోట): పల్లె పోరుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఎలక్షన్‌ గురువారం ఉదయం ఏడు నుంచి ప్రారంభంకానుంది. 34 డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్ల ద్వారా ఎన్నికల సామగ్రిని పంపిణీ చేశారు. 76 జోన్లు.. 176 రూట్లను ఏర్పాటు చేశారు. పోలింగ్‌ సామగ్రితో కేంద్రాలకు బస్సుల్లో సిబ్బంది బుధవారం చేరుకున్నారు. సీతారామపురం మినహా మిగిలిన 34 మండలాల్లో పోలింగ్‌ను నిర్వహించనున్నారు. 1,28,5840 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

కట్టుదిట్టంగా..

30 జెడ్పీటీసీ స్థానాలకు 103 మంది.. 362 ఎంపీటీసీ స్థానాలకు 887 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 1568 పోలింగ్‌ కేంద్రాలకు గానూ 585 సమస్యాత్మక సెంటర్లలోనే సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మిగిలిన చోట్ల ప్రక్రియను వీడియోగ్రాఫర్ల ద్వారా రికార్డు చేయనున్నారు. 10,800 మంది ఉద్యోగులను నియమించారు. వీరిలో 1800 మంది పీఓలున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రత్యేక చర్యలను జిల్లా యంత్రాంగం చేపట్టింది. పోలింగ్‌ వివరాలను ఎప్పటికప్పుడు చేరవేసేందుకు వీలుగా నగరంలోని జెడ్పీ కార్యాలయంలో మీడియా సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ప్రక్రియను సీఈఓ మధుసూదన్‌, డిప్యూటీ సీఈఓ బ్రహ్మయ్య, డీఎల్డీఓలు పర్యవేక్షించనున్నారు.

ఆరు స్ట్రాంగ్‌ రూమ్‌ల ఏర్పాటు

పోలింగ్‌ అనంతరం బ్యాలెట్‌ బాక్సులను స్ట్రాంగ్‌ రూమ్‌లకు తరలించనున్నారు. దీనికి గానూ ఆరింటిని ఏర్పాటు చేశారు. ఓట్లను స్ట్రాంగ్‌ రూమ్‌లలోనే ఈ నెల ఏడున లెక్కించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement