కూటమిపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి | - | Sakshi
Sakshi News home page

కూటమిపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి

Nov 1 2026 12:09 AM | Updated on Nov 1 2026 12:09 AM

సర్వం సన్నద్ధం

● వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం

వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పూజితారెడ్డి

నెల్లూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు నేడు జరుగనున్నాయి. ఈ క్రమంలో నగరంలోని డీకేడబ్ల్యూ కళాశాల నుంచి ఎన్నికల సామగ్రిని సంబంధిత పోలింగ్‌ కేంద్రాలకు తరలించారు. ఎన్నికల విధులకు హాజరయ్యే సిబ్బంది తమకు కేటాయించిన రూట్‌లను పరిశీలించుకుని పోలింగ్‌ సామగ్రిని తీసుకెళ్లారు. ఈ క్రమంలో వారి కోసం ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు.

– సాక్షి ఫొటోగ్రాఫర్‌, నెల్లూరు

బాలికల గురుకులం

పూర్వ ప్రిన్సిపల్‌పై విచారణ

నెల్లూరు(వేదాయపాళెం): నగరంలోని పొదలకూరు రోడ్డులో ఉన్న ఏపీ ట్రైబల్‌ వెల్ఫేర్‌ బాలికల గురుకులంలో పూర్వ ప్రిన్సిపల్‌ వై.మేరీ ప్రియత ఎదుర్కొంటున్న ఆరోపణలపై శనివారం ఆ శాఖ ఉప కార్యదర్శి విచారణ చేపట్టారు. గత నెల 28న సాక్షి దినపత్రికలో ‘ఐటీడీఏ.. వివాదాలమయం’ అనే శీర్షికన ప్రచురితమైన కథనానికి స్పందించిన ఉన్నతాధికారులు అమరావతిలోని ట్రైబల్‌ వెల్ఫేర్‌ కార్యదర్శి కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీ హోదాలో పనిచేస్తున్న కిశోర్‌ను విచారణాధికారిగా నియమించారు. ఆయన శనివారం గురుకులంలోని విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు, గిరిజన సంఘాల నాయకులతో మాట్లాడి నివేదికను సిద్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తామని తెలిపారు.

రాప్తాడు ఘటన హేయం

● కాకాణి పూజితారెడ్డి

ముత్తుకూరు: అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రంలోని జెడ్పీహైస్కూల్లో బాలికపై జరిగిన దాడి అత్యంత హేయమైనదని, మహిళలు, బాలికల పట్ల రాష్ట్రంలో విచ్చలవిడిగా దాడులు జరుగుతున్నాయని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కాకాణి పూజితారెడ్డి అన్నారు. మండలంలోని డమ్మాయపాళెంలో శనివారం ఆమె మాట్లాడారు. బాలికపై రంపంతో దాడికి పాల్పడడం బాధాకరమైన విషయంగా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే బాధిత కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా డిమాండ్‌ చేశారు.

వెంకటాచలం: కూటమి ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని, సజావుగా ఎన్నికలు జరిగితే వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు తిరుగులేని విజయం సాధిస్తారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కాకాణి పూజితా రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలోని చవటపాళెం గ్రామంలో ఆమె శనివారం పర్యటించి, జెడ్పీటీసీ అభ్యర్థి డక్కిలి వెంకటరమణమ్మ, ఎంపీటీసీ అభ్యర్థి కుడితిపూడి వెంకటేశ్వర్లు నాయుడును ప్రజలు ఆశీర్వదించి, ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగకపోవడంతో ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, 2024 ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసిన ప్రజలు ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. చంద్రబాబు ఏ ఒక్క వర్గానికి న్యాయం చేయలేదని, ప్రజలు బహిరంగంగానే చెబుతున్నారని, ముఖ్యంగా మహిళలు తీవ్రంగా మండిపడుతున్నారని తెలియజేశారు. సబ్సిడీ గ్యాస్‌ సిలిండర్లు, మహిళలకు నెలకు రూ.1500 వంటి హామీలను అమలు చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతులు, నిరుద్యోగుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను గుర్తించిన కూటమి నాయకులు ప్రజలను భయపెట్టి ఓట్లు వేయించుకోవాలని కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను ఎన్నిరకాలుగా భయపెట్టినా లెక్కచేయకుండా బరిలో నిలిచారని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను సక్రమంగా అమలు చేసుంటే భయపెట్టి ఓట్లు వేయించుకోవాల్సిన పరిస్థితి ఉండేదా.. అని ప్రశ్నించారు. కూటమి నాయకులు ఎన్ని కుట్రలు చేసినా సర్వేపల్లిలో ప్రజలు వైఎస్సార్‌సీపీకి తిరుగులేని విజయాన్ని అందించడం ఖాయమన్నారు. ఆమె వెంట స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement