వెంకటాచలం: మండలంలోని కాకుటూరు వద్దనున్న విక్రమ సింహపురి యూనివర్సిటీ(వీఎస్‌యూ)లో శనివారం నషాముక్త యువ ర్యాలీని వీసీ అల్లం శ్రీనివాసరావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యవంతమైన, క్రమశిక్షణ కలిగిన, బాధ్యతాయుతంగా జీవించాలని పిలుపునిచ్చారు. దేశ భవిష్యత్ యువత చేతుల్లో ఉందనే విషయాన్ని ప్రతిఒక్కరూ గ్రహించాలన్నారు. అనంతరం దేశ తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఇన్చార్జి రిజిస్ట్రార్ డాక్టర్ కె.సునీత, ప్రిన్సిపల్ డాక్టర్ టి.వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


