నెల్లూరు(టౌన్): కోల్‌కతాలో వచ్చే నెల 1వ తేదీ వరకు త్రోబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించనున్న సబ్ జూనియర్ జాతీయ త్రోబాల్ చాంపియన్‌షిప్ పోటీలకు నెల్లూరు మూలాపేటలోని వేద సంస్కృత పాఠ శాల విద్యార్థులు నవీన్, గంగయ్య ఎంపికయ్యా రు. శుక్రవారం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వైఎన్‌ఆర్ శర్మ విద్యార్థులతోపాటు పీఈటీ చంద్రశేఖర్‌ను అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షుడు చతుర్వేదుల శ్రీరామమూర్తి, కార్యదర్శి ప్రభాకరరావు పాల్గొన్నారు.
10న వీఎస్‌యూలో
ఇంటర్వ్యూలు
వెంకటాచలం: విక్రమ సింహపురి యూనివర్సిటీలోని కాంపిటేటివ్ సెల్‌లో ఆప్టిట్యూడ్ ట్రైనర్, జనరల్ స్టడీస్ ట్రైనర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులకు నవంబర్ 10వ తేదీన వర్సిటీలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఇన్‌చార్జి రిజి స్ట్రార్ డాక్టర్ కె.సునీత శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత విభాగాల్లో విద్యార్హతతోపాటు బోధనలో అనుభవం ఉన్న అభ్యర్థులు ధ్రువీకరణ పత్రాలు, రెజ్యూమ్‌తో ఆరో జు ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూలకు హాజరుకావాలని సూచించారు.
మద్యం విక్రయాలకు బ్రేక్
● మూతపడిన దుకాణాలు, బార్‌లు
నెల్లూరు(క్రైమ్): నెల్లూరు కార్పొరేషన్, బుచ్చిరెడ్డిపాళెం, ఆత్మకూరు మున్సిపాల్టీలకు నవంబర్ ఒకటిన ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో 48 గంటల ముందుగానే మద్యం విక్రయాలను నిలిపివేయాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఎకై ్సజ్ అధికారులను ఆదేశించారు. దీంతో ఎన్నికలు జరిగే ప్రాంతాలతోపాటు 5 కి.మీ పరిధిలోని మద్యం దుకాణాలు, బార్ అండ్ రెసార్టెంట్లకు ఎ కై ్సజ్ అధికారులు శుక్రవారం సాయంత్రం సీళ్లు వేశారు. పోలింగ్ ముగిసిన అనంతరం దుకాణా లు తిరిగి తెరుచుకోనున్నాయి. అలాగే నవంబర్ 3న ఓట్ల లెక్కింపు నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రానికి ఐదు కిలోమీటర్ల పరిధిలోని దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లను మూసివేయనున్నారు. కలెక్టర్ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎకై ్సజ్ అధికారులు హెచ్చరించారు.
20 రకాల గుర్తింపు
పత్రాలతో ఓటు
నెల్లూరురూరల్: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటరు గుర్తింపు కార్డు (ఎపిక్) తప్పనిసరి కాద ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హిమాన్షు శుక్లా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎపిక్ కార్డు లేని వారు ఎన్నికల సంఘం సూచించిన 20 రకాల ప్రత్యామ్నాయ ఫొటో గుర్తింపు పత్రాల్లో ఏదైనా ఒకటి చూపించి ఓటు వేయొచ్చన్నారు. నవంబరు 1న జరిగే పోలింగ్‌లో ఓటర్లంతా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని కోరారు.
ప్రత్యామ్నాయ గుర్తింపు పత్రాలివే..
ఆధార్ కార్డు, పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, ప్రభుత్వ ఉద్యోగుల ఫొటో గుర్తింపు కార్డులు, ఫొటోతో కూడిన పెన్షన్ పేమెంట్ ఆర్డర్, మాజీ సైనికుల పెన్షన్ పుస్తకం, వృద్ధాప్య, వితంతు పెన్షన్ పత్రాలు, ఫొటోతో కూడిన పట్టాదారు పాస్‌బుక్‌లు, రిజిస్టర్డ్ ఆస్తి పత్రాలు, ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు, పోస్టాఫీసులు, ఏపీసీఓబీ, డీసీసీబీలు జారీ చేసిన ఫొటో పాస్‌బుక్‌లు, కిసాన్ పాస్‌బుక్‌లు, ఫొటోతో కూడిన ఏటీఎం కార్డులు, రేషన్ కార్డులు, జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్) స్మార్ట్ కార్డులు, ఉపాధి హామీ జాబ్ కార్డు, ఫొటోతో కూడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ ధ్రువీకరణ పత్రాలు, స్వాతంత్య్ర సమరయోధుల గుర్తింపు కార్డులు, ఆయుధ లైసెన్సులు, దివ్యాంగ ధ్రువీకరణ పత్రాలు, బార్ కౌన్సిల్ సభ్యత్వ కార్డులు, కార్మిక మంత్రిత్వ శాఖ పథకం కింద జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు జారీ చేసిన ఫొటో గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి చూపించి ఓటు వేయొచ్చని వెల్లడించారు.
జిల్లాలో పటిష్టంగా 144 సెక్షన్ అమలు
‘జిల్లాలో మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో 144 సెక్షన్‌ను పటిష్టంగా అమలు చేస్తున్నాం’ అని కలెక్టర్ హిమాన్షు శుక్లా వెల్లడించారు. శుక్రవారం రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠ జిల్లా ఎన్నికల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ ఏర్పాట్లను వివరించారు. అనంతరం హిమాన్షు శుక్లా మాట్లాడుతూ ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఉండకుండా చర్యలు చేపట్టామన్నారు.


