కావలి: భగవాన్ సత్యసాయిబాబా శత జయంతి వేడుకలను పురస్కరించుకుని ప్రారంభించిన శ్రీసత్యసాయి ప్రేమ వాహిని రథం శుక్రవారం కావలికి చేరుకుంది. ప్రకాశం జిల్లా నుంచి తరలివస్తున్న రథానికి పట్టణ ఉత్తర శివార్లలో సత్యసాయి ట్రస్టు సభ్యులు, భక్తులు స్వాగతం పలికారు. ట్రంక్‌రోడ్ పొడవున రథయాత్ర సాగింది. ఈ సందర్భంగా శ్రీసత్యసాయి ట్రస్టు జిల్లా అధ్యక్షుడు సుధాకర్‌రావు మాట్లాడుతూ ప్రతిఒక్కరూ ప్రేమ స్వరూపులేనని, అందరి హృదయాల్లో ప్రేమ నింపి వారిలో దివ్యత్వాన్ని వెలికి తీయడమే రథ సందేశమని పేర్కొన్నారు. రథ యాత్ర సాగే మార్గాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు.


