సన్నారెడ్డికి బెయిల్‌ మంజూరు | - | Sakshi
Sakshi News home page

సన్నారెడ్డికి బెయిల్‌ మంజూరు

Oct 31 2026 12:01 AM | Updated on Oct 31 2026 12:01 AM

చిట్టమూరు: పరిషత్‌ ఎన్నికల్లో టీడీపీకి అడ్డంకిగా మారిన వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ సన్నారెడ్డి శ్రీనివాసులరెడ్డిపై అక్రమ కేసు బనాయించి అరెస్ట్‌ చేసి జైలుకు పంపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన బెయిల్‌కు దరఖాస్తు చేసుకోగా కోర్టు శుక్రవారం మంజూరు చేసింది. దీంతో ఆయన జైలు నుంచి నేరుగా వాకాడులోని వెంకటగిరి వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డిని కలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ టీడీపీ అరాచకాలకు అడ్డు పడుతున్నామని అక్రమ కేసులు బనాయించడం పరిపాటిగా మారిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరన్నారు.

ఖైదీలు సత్ప్రవర్తనతో నడుచుకోవాలి

కావలి: క్షణికావేశంలో తప్పులు చేసి జైలుకు వచ్చిన వారు సత్ప్రవర్తనతో నడుచుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి వైజే పద్మశ్రీ సూచించారు. పట్టణంలోని సబ్‌జైల్లో న్యాయవిజ్ఞాన సదస్సును శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఖైదీలు సత్ప్రవర్తనతో నడుచుకుంటే జైలు శిక్ష తగ్గించే అవకాశం ఉంటుందని తెలిపారు. న్యాయవాదులను ఏర్పాటు చేసుకునే స్తోమత లేని ఖైదీలకు ఉచితంగా న్యాయసాయాన్ని అందిస్తామన్నారు. తొలుత జైల్లో కల్పిస్తున్న సౌకర్యాలపై ఖైదీలను ఆరాతీశారు. లోక్‌అదాలత్‌ సభ్యుడు మాలకొండారెడ్డి, జైలు సూపరింటెండెంట్‌ చినసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.

ముగిసిన కోచింగ్‌ క్యాంప్‌

కావలి: పట్టణంలోని జవహర్‌ భారతి కళాశాలలో నిర్వహిస్తున్న విక్రమ సింహపురి యూనివర్సిటీ టెబుల్‌ టెన్నిస్‌ మెన్స్‌ టీమ్‌ కోచింగ్‌ క్యాంప్‌ శుక్రవారంతో ముగిసింది. విశాఖపట్నంలో శనివారం నుంచి నిర్వహించనున్న సౌత్‌ జోన్‌ అంతర్‌ విశ్వవిద్యాలయాల టోర్నీ లో వీరు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులు, శిక్షకులకు దుస్తులను అందజేశారు. వర్సిటీ కాలేజీ కావలి ప్రిన్సిపల్‌ శ్రీనివాసరావు, సీనియర్‌ టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారుడు పులివర్తి భాస్కర్‌, టీమ్‌ కోచ్‌ శివయ్య, మణికంఠ, ప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement