కర్షకుడికి పంగనామాలు | - | Sakshi
Sakshi News home page

కర్షకుడికి పంగనామాలు

Oct 31 2026 12:01 AM | Updated on Oct 31 2026 12:01 AM

నెల్లూరు(వేదాయపాళెం): అన్నదాతకు టీడీపీ ప్రభుత్వం పంగనామాలు పెడుతోంది. 2024లో సర్కార్‌ కొలువుదీరాక తొలి ఏడాది పథకాన్ని అమలు చేయకుండా జిల్లాలోని రైతులకు మొండిచేయి చూపింది. ఆపై ఏడాది ఏడాదికీ లబ్ధిదారుల సంఖ్యను భారీగా తగ్గిస్తోంది. ఇలా గడిచిన రెండేళ్లలో జిల్లాలో 50 వేల మందికిపైగా కర్షకులను అన్నదాత సుఖీభవ పథకానికి అనర్హులుగా ప్రకటించింది.

పేరు మార్పునకే పరిమితం

వాస్తవానికి గత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ హయాంలో రైతు భరోసాను సమర్థంగా అమలు చేశారు. ఆ సమయంలో అన్నదాత ఖాతాలో ఏడాదికి రూ.13,500 చొప్పున ఐదేళ్లూ జమచేశారు. ఈ క్రమంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే ఏడాదికి రూ.20 వేల చొప్పున అందజేస్తామని చంద్రబాబు ప్రకటించారు. తీరా రూ.14 వేలకే పరిమితం చేశారు. రైతు భరోసాను అన్నదాత సుఖీభవగా మార్చడం, లబ్ధిదారులను కుదించడం మినహా ఆయన చేసిందేమీలేదనే భావన అన్నదాతల్లో వ్యక్తమవుతోంది.

జిల్లాలో ఇలా..

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ హయాంలో జిల్లాలోని 2,27,836 మంది కర్షకుల ఖాతాల్లో రైతు భరోసా కింద నగదు జమయ్యేది. అయితే టీడీపీ ప్రభుత్వంలో ఈ సంఖ్యను 1.96 లక్షలకు.. ఆపై 1.77 లక్షలకు కుదిరించారు. ఇందులో 1.4 లక్షల మందికి పీఎం కిసాన్‌ అందుతోంది. ఈ లెక్కన చూస్తే రెండేళ్లలో దాదాపు 50 వేల మందిని ఈ పథకానికి దూరం చేశారు. గతంలో కందుకూరు నియోజకవర్గం జిల్లాలో ఉండటంతో లబ్ధిదారుల సంఖ్య ఎక్కువగా ఉండేదని, అయితే ప్రకాశం జిల్లాలోకి వెళ్లడంతో సంఖ్య తగ్గిందంటూ రైతులను తప్పుదోవ పట్టించేందుకు అధికార యంత్రాంగం యత్నిస్తోంది. మరోవైపు జిల్లాలో గూడూరు చే రడంతో ఇది పెరగాలని కదానని ఎవరైనా ప్రశ్నిస్తే, వీరి నుంచి మౌనమే సమాధానమవుతోంది.

మరోసారి మోసం చేసేందుకే..

రైతుల అభివృద్ధి, సంక్షేమం పట్టని పాలకులు.. మరోసారి మోసం చేసేందుకు సిద్ధమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న తరుణంలో పోలింగ్‌కు ముందే రైతుల ఖాతాల్లో నగదును జమచేసి.. వారిని ప్రసన్నం చేసుకునేందుకు సిద్ధమయ్యారనే ప్రచారం జరుగుతోంది. ఎన్నికల తాయిలంలా దీన్ని ఆగమేఘాలపై వేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు అన్నదాత సుఖీభవ పథకం నగదును శుక్రవారం విడుదల చేస్తున్నామని, అయితే దీనిపై ఎలాంటి ప్రచారం కల్పించొద్దని.. మీడియాకు అసలు తెలపొద్దంటూ ప్రభుత్వ పెద్దల నుంచి మౌఖిక ఆదేశాలు వ్యవసాయ శాఖకు అందాయని సమాచారం.

నాడు అన్నదాత సుఖీభవ అంటూ ఆర్భాటపు ప్రచారం

నేడు అనేక మందిపై అనర్హత వేటు

రెండేళ్లలో జిల్లాలో 50 వేల

మందికిపైగా లబ్ధిదారుల తొలగింపు

విజయమే పరమావధిగా గత ఎన్నికలకు ముందు నిర్వహించిన ప్రచార సభల్లో సూపర్‌ సిక్స్‌ అంటూ అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం చంద్రబాబు ఊకదంపుడు హామీలిచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక వీటిలో దేన్నీ సక్రమంగా అమలు చేయకపోగా, అందుకుంటున్న వారి సంఖ్యను తగ్గిస్తూ పైశాచికానందాన్ని పొందుతున్నారు. ఇదే కోవలోకి అన్నదాత సుఖీభవ పథకం చేరింది. గడిచిన రెండేళ్లలో జిల్లాలో 50 మంది లబ్ధిదారుల పేర్లను తొలగించి వారికి అంతులేని శోకాన్ని మిగిల్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement