కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలి

Oct 31 2026 12:01 AM | Updated on Oct 31 2026 12:01 AM

● మాజీ ఎమ్మెల్యే విక్రమ్‌రెడ్డి

ఆత్మకూరు రూరల్‌: స్థానిక మున్సిపాల్టీలో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ చేస్తున్న దుర్మార్గాలపై ప్రజల్లో ఆందోళన నెలకొందని, ఈ క్రమంలో కేంద్ర బలగాలతో ఓటర్లకు రక్షణ కల్పించాలని ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. పట్టణ పరిధిలోని మూడో వార్డులో గల వీవర్స్‌కాలనీ, 26వ వార్డులో గల పేరారెడ్డిపల్లి బీసీ కాలనీల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల తరఫున శుక్రవారం నిర్వహించిన ప్రచారంలో ఆయన మాట్లాడారు. అవసరమైన భద్రత చర్యలు చేపట్టాలని, ఈ మేరకు ఈసీ, ఎస్‌ఈసీ కమిషనర్లకు ఈ – మెయిల్‌తో పాటు కలెక్టర్‌కు లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేశామని తెలిపారు. పట్టణంలోని కొన్ని వార్డుల్లో దొంగ ఓట్లు.. ఓటర్లను బెదిరించడం, ప్రలోభాలకు గురిచేయడం వంటి అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపించారు. కొంతమంది అభ్యర్థులను పోలీసుల ద్వారా భయభ్రాంతులకు గురిచేస్తున్నారని చెప్పారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో సీసీ కెమెరాలతో పాటుగా వెబ్‌క్యాస్టింగ్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. రిగ్గింగ్‌కు పాల్పడే మూకలపై చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. అక్రమాలపై వచ్చే ఫిర్యాదులపై తక్షణమే విచారణ జరిపి చర్యలు చేపట్టాలన్నారు. పోలింగ్‌తో పాటు ఓట్ల లెక్కింపు పూర్తయ్యేంత వరకు మున్సిపాల్టీ పరిధిలో కేంద్ర బలగాలతో భద్రతను కొనసాగించాలని కోరారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థి అల్లారెడ్డి ఇందుమతి, జెడ్పీ మాజీ చైర్మన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఆదిశేషయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement