ఆత్మకూరు రూరల్: తనకు అవకాశమిచ్చి గెలిపిస్తే ఆత్మకూరు రూపురేఖలను మార్చేందుకు కృషి చేస్తానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మున్సిపాల్టీ చైర్‌పర్సన్ అభ్యర్థి అల్లారెడ్డి ఇందుమతి పేర్కొన్నారు. పట్టణంలోని వార్డుల్లో తమకు అపూర్వ ఆదరణ లభిస్తోందని ఆమె వివరించారు. ఈ మేరకు సాక్షి శుక్రవారం నిర్వహించిన ఇంటర్వ్యూలో పలు అంశాలను ఆమె తెలియజేశారు.
ప్రశ్న: మీ లక్ష్యమేమిటి..?
సమాధానం: ప్రచారంలో భాగంగా ఎక్కడికెళ్లినా తన మామ అల్లారెడ్డి కృష్ణారెడ్డి మండలాధ్యక్షుడిగా అందించిన సేవలను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. తన కుటుంబ 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఎలాంటి అవినీతి మరకల్లేవు. ఆస్తులు సంపాదించకుండా రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తున్నాం. ఆత్మకూరు మున్సిపాల్టీ అభివృద్ధే ధ్యేయంగా అంకితభావంతో పనిచేస్తాం.
ప్రశ్న: ఎలాంటి సమస్యలు
మీ దృష్టికొచ్చాయి..?
సమాధానం: ఆత్మకూరు మున్సిపాల్టీలో సమస్యలు తీరడంలేదు. తిప్ప ప్రాంతంలో వందలాది కుటుంబాలు మూడు దశాబ్దాలుగా ఇళ్లు నిర్మించుకొని నివసిస్తున్నా, ఇప్పటికీ వారికి పట్టాల్లేవు. తాను చైర్‌పర్సన్‌గా గెలుపొందితే వీటిని పరిష్కరిస్తా. టిడ్కో సముదాయంలో తాగునీటి సౌకర్యం, ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ, ఆరోగ్య ఉప కేంద్రాలు, ఆర్టీసీ స్టాపింగ్ లాంటి సమస్యలతో అక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలియజేశారు. వీటి పరిష్కారమే లక్ష్యం. పట్టణంలో తాగునీటి సమస్య పరిష్కారానికి జల్‌జీవన్ మిషన్ – అమృత్ పథకాల ద్వారా నిధులు తమ ప్రభుత్వ హయాంలో మంజూరైనా, వీటిని ప్రస్తుత పాలకులు పూర్తి చేయలేదు.
ప్రశ్న: విజయావకాశాలపై
మీ స్పందన..?
సమాధానం: మున్సిపాల్టీలోని 28 వార్డుల్లో రెండు చోట్ల మిత్రపక్షంగా సీపీఎం, మిగిలిన ప్రాంతాల్లో తమ పార్టీ పోటీ చేస్తోంది. తమ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంపై ప్రజల్లో బలమైన విశ్వాసముంది. ఇదే తమను గెలిపిస్తుంది. ప్రజల ఆశీస్సులతో విజయం సాధించి మున్సిపాల్టీ అభివృద్ధికి కృషి చేస్తా.
అవకాశమిస్తే పూర్తి స్థాయిలో
సేవలందిస్తా
ప్రజల నుంచి అపూర్వ ఆదరణ
ఆత్మకూరు మున్సిపాల్టీ చైర్‌పర్సన్
అభ్యర్థి అల్లారెడ్డి ఇందుమతి


