సూపర్‌సిక్స్‌ అమల్లో చంద్రబాబు విఫలం | - | Sakshi
Sakshi News home page

సూపర్‌సిక్స్‌ అమల్లో చంద్రబాబు విఫలం

Oct 31 2026 8:31 AM | Updated on Oct 31 2026 8:31 AM

కండలేరులో 16.770 టీఎంసీలు

రాపూరు: కండలేరు జలాశయంలో శుక్రవారం నాటికి 16.770 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 70, లోలెవల్‌ కాలువకు 10, పిన్నేరు కాలువకు 5, మొదటి బ్రాంచ్‌ కాలువకు 7 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.

● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

ముత్తుకూరు: సూపర్‌ సిక్స్‌ పేరుతో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అమలులో మాత్రం ఘోరంగా వైఫల్యం చెందుతున్నట్టుగా మాజీమంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. మండలంలోని పొట్టెంపాడు, బ్రహ్మదేవం గ్రామాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులతో కలిసి శుక్రవారం కాకాణి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారాన్ని అడ్డుపెట్టుకుని విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్న చంద్రబాబు మెడలు వంచాలంటే స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించాలన్నారు. కూటమి ఏర్పడిన తర్వాత ఏ ఒక్క ఎన్నికల హామీను సక్రమంగా అమలు చేసిన పాపాన పోలేదన్నారు. టీడీపీ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా సర్వేపల్లిలో మొత్తం 79 ఎంపీటీసీలు, ఐదు జెడ్పీటీసీ స్థానాలకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నిలబెట్టామంటే నాయకులు, కార్యకర్తల కృషేనన్నారు. సోమిరెడ్డి తరచుగా తనపై సవాల్‌ చేస్తుంటాడని ప్రతి సవాల్‌ చేసి రమ్మంటే ఒక్కసారి చర్చకు వచ్చిన దాఖలాల్లేవన్నారు. స్థానిక ఎన్నికలను కుట్రలు, కుతంత్రాలతో చంద్రబాబు నిర్వహిస్తున్నట్టు ఆరోపించారు. ఎన్నికల సందర్భంగా అధికారులు, పోలీసులు ఓవర్‌ యాక్షన్‌ చేస్తే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. గత ప్రభుత్వంలో తాను చేసిన అభివృద్ధి తమ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ అభ్యర్థి నెల్లూరు పరిమళ, ఎంపీటీసీ అభ్యర్థులు మెట్ట విష్ణువర్ధన్‌రెడ్డి, దువ్వూరు సుబ్బరామిరెడ్డి, స్రవంతి, కట్ట సుబ్రహ్మణ్యం, చిన్నపరెడ్డి, నాయకులు జనార్దన్‌రెడ్డి, దువ్వూరు హారికారెడ్డి, హేమంత్‌ రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, జమీల్‌, షేక్‌ మస్తాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement