టాక్‌ ఆఫ్‌ సింహపురి | - | Sakshi
Sakshi News home page

టాక్‌ ఆఫ్‌ సింహపురి

Oct 30 2026 2:27 AM | Updated on Oct 30 2026 2:27 AM

కేజీ బియ్యం వంద చేసినందుకెయ్యాలా ఓటు!

ఏందిరయ్యా.. ఇదా!

ఒరే అల్లుడా.. ఏందిరా నెల్లూరు జనమేమైనా పిచ్చోళ్లారా..

ఏంది మామ.. దేని గురించి..

అదేరా.. మీ టీడీపీ వాళ్లు మంత్రి నారాయణ నెల్లూరును వేల కోట్లతో అభివృద్ధి చేస్తున్నాడని మైకుల్లో ఒకటే ఊదగొట్టుతున్నారు.

‘ఒరే నాకర్థంకాక అడుగుతున్నా.. నెల్లూరు కార్పొరేషన్‌ ఏడాది బడ్జెట్టే రూ.470 కోట్లని పేపర్లలో వార్తలు వచ్చాయి. ఉన్న బడ్జెట్‌ ఖర్చులకే సరిపోతుందని లెక్కలు కూడా చెప్పారు. ఇప్పుడేడ నుంచి వేల కోట్లు వచ్చాయిరా.’

‘మీ పార్టీ వచ్చి రెండున్నర సంవత్సరాలు దాటింది.. ఏ ఒక్క పనైనా చేశార్రా.’

అది కాదు మామ.. ఆ మాత్రం చెప్పకపోతే మాకు ఓట్లేసేదెవరు. మన నెల్లూరోళ్లు పిచ్చొళ్లు కాకపోతే.. మొన్న ఎలక్షన్‌లో మా పార్టీని ఎట్టా గెలిపించారంటావు.

ఆ జగను ఎంత చేసినా.. మా చంద్రబాబు, నారాయణ చెప్పిన అబద్ధాలు నమ్మే కాదా.. మా పార్టీని గెలిపించింది. మళ్లీ గెలిపించాలంటే.. ఈ రెండున్నర సంవత్సరాల్లో మేం చేశామని చెప్పడానికి మేమేం చేశాము. ఆ మాత్రం చెప్పకపోతే.. ఎట్లా!

సరేరా అల్లుడా.. మళ్లీ అట్టనే గెలిపిస్తారంటవా?

వాళ్లు గెలిపించేదేంది మామ.. ఎట్ట గెలవాలో మా నాయకులు ప్లాన్‌ చేశార్లే.

ఏం ప్లాన్‌ చేశారేంట్రా.

అయ్యన్ని.. చెప్పకూడదు మామ.. కౌంటింగ్‌ అయ్యాక చూడు.. మేమే గెలుస్తాం. బై మామ.

ఓ.. మామ ఈసారి మా పార్టీకే ఓటెయ్యాల.

‘అన్నా.. ఈయన మా మామ. పోయినసారి మన పార్టీకి దగ్గరుండి చాలా ఓట్లు వేయించాడు.’

ఇప్పుడు మన డివిజన్‌ మారిపోయింది కదా.

‘వయసు మీద పడింది.. యాడకి తిరిగే ఓపిక లేక.. ఇంటికి పరిమితమయ్యాడు’

పెద్దాయన.. ఈ సారి మీ ఇంట్లో ఓట్లతోపాటు పక్కింటోళ్లు కూడా మనకే ఓట్లు వేసేలా చూడు.

సరే అయ్యా.. ఓ మాటడుగుతా సమాధానం చెప్పతావా?

అడుగు పెద్దాయన

‘ముప్పై ఏళ్లుగా చంద్రబాబును నమ్ముకుని పార్టీ కోసం కష్టపడ్డాను.. నాకు డైబ్బె ఏళ్లొచ్చాయి. జగన్‌ గవర్నమెంట్‌లో పెన్షన్‌ రాస్తామన్నా.. రాయించుకోలేదు. మన గవర్నమెంట్‌ వస్తే.. రాసుకుందామని మూడేళ్లుగా పెన్షన్‌ కోసం ఎదురు చూస్తున్నాను. నాకు పింఛన్‌ ఇయలేదు. నా బిడ్డ పెనిమిటి చనిపోయాడు. దానికి పెన్షన్‌ రాయిద్దామంటే కొత్తగా పెన్షన్‌ రాయకపోతుండిరి. నేను పోయేలోగా నాకూ.. నా బిడ్డకూ పెన్షన్లు వస్తాయని నమ్మకం పోయిందయ్యా’

‘చంద్రబాబు వచ్చి.. సంపద సృష్టిస్తానంటే.. ఆ పిచ్చిలో ఉండి ఏదో ఉద్దరిస్తాడనుకుంటే.. కేజీ బియ్యం వందయ్యాయి. పదివేలుంటే ఇల్లు గడిచిపోతుండేది. ఇప్పుడు ముప్పై వేలు కూడా సరిపోవడంలేదు. కూరగాయల నుంచి చిల్లర సామాన్లు వరకు రేట్లు చూస్తే మండిపోతున్నాయి. సంపద సృష్టి ఏమో కానీ.. మా సంపద ఆవిరైపోతుందయ్యా.

‘ఇప్పుడు చెప్పయ్యా.. బియ్యం వంద చేసినందుకు ఓటెయ్యాలా.. సంపద ఆవిరి చేస్తున్నందుకెయ్యాలా..’

ఒక మాట చెబుతానయ్యా.. మనం ఎంత ద్వేషించినా.. ఆ జగను ప్రభుత్వమే మేలయ్యా..

‘సరే.. పెద్దాయన ఈ ఎన్నికల్లో మనం గెలిస్తే.. నేనొచ్చి నీకు.. మీ కూతురుకు పింఛన్‌ రాయించే బాధ్యత నాది? మరిచిపోబాకు..’

సరే వస్తాం పెద్దాయన.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement