రైళ్లలో చోరీలు | - | Sakshi
Sakshi News home page

రైళ్లలో చోరీలు

Oct 30 2026 2:27 AM | Updated on Oct 30 2026 2:27 AM

● నిందితుడి అరెస్ట్‌

● రూ.పది లక్షల సొత్తు స్వాధీనం

నెల్లూరు(క్రైమ్‌): రైళ్లలో చోరీలకు పాల్పడుతున్న దొంగను రైల్వే పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతని నుంచి రూ.పది లక్షల విలువజేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి వివరాలను తన కార్యాలయంలో నెల్లూరు రైల్వే డీఎస్పీ మురళీధర్‌, రైల్వే సీఐ సుధాకర్‌ గురువారం వెల్లడించారు. హైదరాబాద్‌ నుంచి చైన్నె వెళ్తున్న చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఓ మహిళ మెడలోని గొలుసు చోరీకి గురైన ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. సాంకేతికత ఆధారంగా నిందితుడ్ని ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలానికి చెందిన పాతనేరస్తుడు త్రిమోది అలియాస్‌ గోవిందుగా గుర్తించి గాలింపు చర్యలు చేపట్టారు. కావలి రైల్వేస్టేషన్లో నిందితుడ్ని బుధవారం అదుపులోకి తీసుకొని విచారించారు. కావలి, నెల్లూరు, గూడూరు పరిధిలో రైళ్లలో దొంగతనాలకు పాల్పడ్డానని అంగీకరించడంతో అరెస్ట్‌ చేసి అతని నుంచి మూడు కేసులకు సంబంధించిన 72 గ్రాముల బంగారు ఆభరణాలు, హ్యాండ్‌బ్యాగ్‌, రూ.పది వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై ఒంగోలు, శింగరాయకొండ, నెల్లూరులో కేసులున్నాయని డీఎస్పీ చెప్పారు. ప్రతిభ కనబర్చిన సీఐతో పాటు నెల్లూరు, కావలి, గూడూరు రైల్వే ఎస్సైలు హరిచందన, వెంకట్రావు, నారాయణ, సిబ్బంది మణికంఠ, కిరణ్‌, హుమయూన్‌, తేజ, హరి, జయరాజు, వెంకటబాబు, సుజాతను డీఎస్పీ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement