నెల్లూరు (టౌన్): స్థానిక సంస్థల ఎన్నికలను జిల్లాలో సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. నగరంలోని డీకేడబ్ల్యూ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాలను అధికారులతో కలిసి గురువారం పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్‌కు అవసరమైన ఏర్పాట్లు చేశామని వివరించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లకు జిల్లా యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తున్నామన్నారు. ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. వర్షాలు కురిసే అవకాశముందనే వాతావరణ శాఖ హెచ్చరికలతో ఎన్నికల నిర్వహణకు అవసరమైన ముందస్తు చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. జేసీ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ అనూష, కమిషనర్ నందన్ తదితరులు పాల్గొన్నారు.
టీడీపీ దారుణాలపై హైకోర్టుకు..
అనుమసముద్రంపేట: ఏఎస్‌పేటలోని నాలుగు ఎంపీటీసీ సెగ్మెంట్లలో టీడీపీ ఏకగ్రీవాలు చేసుకున్న తరుణంలో హైకోర్టును చిరమన, చౌటభీమవరం, గుంపర్లపాడు, హసానపురం అభ్యర్థులు గురువారం ఆశ్రయించారు. బాధితుల తరఫున పలు అంశాలను న్యాయవాది కండె తులసీరామ్ తీసుకున్నారు. ఉపసంహరణల ప్రక్రియను తక్షణమే నిలిపేయాలంటూ హైకోర్టులో అత్యవసర రిట్ లంచ్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేశారు. వీటిని పరిశీలించిన జడ్జి.. అన్ని ఆధారాలను బెంచ్ ముందు సోమవారం సమర్పించాలని బాధితులకు సూచించారు.
నేటి నుంచి
వైన్ షాపులు, బార్ల మూత
నెల్లూరు(క్రైమ్): నెల్లూరు కార్పొరేషన్, ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెం మున్సిపల్ ఎన్నికల సందర్భంగా డ్రైడే ఉత్తర్వులను కలెక్టర్ హిమాన్షు శుక్లా గురువారం జారీ చేశారు. శుక్రవారం సాయంత్రం ఐదు నుంచి నవంబర్ ఒకటో తేదీ పోలింగ్ ముగిసేంత వరకు సంబంధిత ప్రాంతాల్లో వైన్ షాపులు, బార్లు, కల్లు దుకాణాలను మూసేయడంతో పాటు ఓట్ల లెక్కింపు సందర్భంగా కౌంటింగ్ కేంద్రాల చుట్టూ ఐదు కిలోమీటర్ల పరిధిలో మద్యం విక్రయాలను మూడున నిలిపేయాలని ఆదేశించారు. ఉత్తర్వులను నిర్వాహకులు తప్పక పాటించాలని, ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ జిల్లా అధికారి శ్రీనివాసులునాయుడు హెచ్చరించారు.
తొమ్మిది నుంచి
ఎస్‌ఏ – 1 పరీక్షలు
నెల్లూరు (టౌన్): జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్య పాఠశాలల్లో సమ్మేటివ్ అసెస్మెంట్ (ఎస్‌ఏ – 1) పరీక్షలను నవంబర్ తొమ్మిది నుంచి నిర్వహించనున్నారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12.30 వరకు.. ఆరు, ఏడో తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 1.15 నుంచి 4.15 వరకు.. ఎనిమిది నుంచి పదో తరగతి వారికి ఉదయం తొమ్మిది నుంచి 12.30 వరకు జరపనున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు క్లస్టర్ కాంప్లెక్స్ నుంచి, ఉన్నత పాఠశాల వారు ప్రశ్నపత్రాలను ఎమ్మార్సీలో తీసుకోవాల్సి ఉంటుంది.
షోకాజ్ నోటీసుల జారీ
నెల్లూరు(పొగతోట): జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు గానూ 11 వేల మంది ఉద్యోగులను ఎంపిక చేసి మొదటి విడత శిక్షణ కార్యక్రమాలకు హాజరకావాల్సిందిగా అందరికీ సమాచారమిచ్చారు. అయితే గురువారం నిర్వహించిన ట్రెయినింగ్‌కు 308 మంది హాజరుకాకపోవడంపై కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరికి షోకాజ్ నోటీసు లను జారీ చేయాలని ఆదేశించారు. కాగా మై క్రో అబ్జర్వర్లకు శిక్షణ కార్యక్రమాన్ని నగరంలో ని కస్తూర్బా కళాక్షేత్రంలో శుక్రవారం మధ్యా హ్నం మూడుకు నిర్వహించనున్నారు.
ఎలక్షన్లకు పటిష్ట భద్రత
నెల్లూరు(క్రైమ్): పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికలకు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేపట్టామని ఎస్పీ అజిత వేజెండ్ల తెలిపారు. నగరంలోని పెన్నా వారధి నుంచి గాంధీబొమ్మ వరకు గురువారం సాయంత్రం నిర్వహించిన ఫ్లాగ్‌మార్చ్‌లో ఆమె మాట్లాడారు. ప్రజలందరూ నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూ చించారు. పోలీస్ శాఖ చేపడుతున్న చర్య లు, బందోబస్తు వివరాలను వెల్లడించారు. ఏఎస్పీ లు సౌజన్య దీక్ష తదితరులు పాల్గొన్నారు.


