సేవలు టీడీపీలో.. వేతనం ఎన్నెమ్సీలో..! | - | Sakshi
Sakshi News home page

సేవలు టీడీపీలో.. వేతనం ఎన్నెమ్సీలో..!

Oct 30 2026 2:27 AM | Updated on Oct 30 2026 2:27 AM

నెల్లూరు(బారకాసు): నగరపాలక సంస్థ కార్యాలయంలోని శానిటేషన్‌ విభాగంలో ఆప్కాస్‌ ద్వారా నియమితులైన ఇద్దరు ఉద్యోగులు విధులు నిర్వర్తించకుండానే ప్రతి నెలా జీతాలను పొందుతున్నారు. ఈ తంతు కొన్నేళ్లుగా సాగుతున్నా, సంబంధిత అధికారులు తమకేమీ పట్టదనే రీతిలో వ్యవహరిస్తున్నారు. ఎనిమిదేళ్లుగా అజారుద్దీన్‌.. ఐదేళ్లుగా ఉమర్‌ విధులకు హాజరుకాకుండా జీతాన్ని మాత్రం పొందుతున్నారు. ఏడాదికోసారి కార్యాలయానికి వెళ్లి హాయ్‌ అని పలకరించి.. ఆ విభాగంలోని అధికారులను మేనేజ్‌ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీడీపీ సేవలో తరిస్తూ.. వేతనాలను పొందుతుండటం విస్మయానికి గురిచేస్తోంది.

ప్రచారంలో తరిస్తూ..

58వ డివిజన్లో టీడీపీ నుంచి కార్పొరేటర్‌గా పోటీ చేస్తున్న కరిముల్లాతో కలిసి అజారుద్దీన్‌.. 57వ డివిజన్‌ అభ్యర్థి షబానాతో కలిసి ఎన్నికల ప్రచారంలో ఉమర్‌ పాల్గొంటున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో విధులు నిర్వర్తించే వారు రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదనే నిబంధన ఉన్నా, వీరికి ఏ మాత్రం పట్టడంలేదు. వీరిపై అధికారులు ఎలాంటి చర్యలు చేపడతారో వేచి చూడాల్సి ఉంది.

టీడీపీ అభ్యర్థులతో కలిసి ప్రచారంలో పాల్గొంటున్న అజారుద్దీన్‌, ఉమర్‌

శానిటేషన్‌ విభాగంలో విధులకు

కొన్నేళ్లుగా హాజరుకాని ఇద్దరు ఉద్యోగులు

ప్రస్తుతం ఆ పార్టీ కార్పొరేటర్‌ అభ్యర్థులతో ప్రచారంలో పాల్గొంటున్న వైనం

పట్టించుకోని అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement