● వైఎస్సార్‌సీపీలో చేరిక
నెల్లూరురూరల్: వైఎస్సార్‌సీపీపై నమ్మకంతోనే అనేకమంది చేరుతున్నట్లుగా ఎమ్మెల్సీ, నెల్లూరు సిటీ ఇన్‌చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, మేయర్ అభ్యర్థి ఆనం విజయకుమార్‌రెడ్డి అన్నారు. నెల్లూరులోని 59వ డివిజన్‌కు చెందిన యూసఫ్ మిత్రబందంలోని 20 కుటుంబాలు తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరాయి. బుధవారం నెల్లూరు రాంజీనగర్‌లోని సిటీ కార్యాలయంలో పర్వతరెడ్డి, ఆనం ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. వారికి నాయకులు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ విధానాలతో విసిగిపోయిన ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరుతున్నారన్నారు. రానున్న రోజుల్లో పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో 59వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి చీదెళ్ల కిషన్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


