అల్లూరు చెరువుపై కూటమి నేతల పెత్తనం | - | Sakshi
Sakshi News home page

అల్లూరు చెరువుపై కూటమి నేతల పెత్తనం

Oct 29 2026 12:54 AM | Updated on Oct 29 2026 12:54 AM

● అంతుచూస్తామంటూ బెదిరింపులు

● గిరిజనుల వెల్లడి

అల్లూరు: అల్లూరు చెరువుపై కూటమి నాయకులు అండదండలతో వలిమేటి వీర రాఘవులు అనే వ్యక్తి తమ హక్కును దోచుకుంటున్నాడని అల్లూరు చోర్లో సంఘానికి చెందిన గిరిజనులు తెలిపారు. బుధవారం పలు కాలనీలకు చెందిన వారు స్థానికంగా మీడియా సమావేశంలో మాట్లాడారు. 3 వేల ఎకరాలున్న చెరువులో 300 మంది వరకు సభ్యులుగా ఉండొచ్చని, కానీ వందమంది సభ్యులుగా ఉన్నా కూడా వారిని దిగనివ్వకుండా, కొత్తవారిని చేర్చుకోకుండా అతనొక్కడే మత్స్య సంపదన దోచుకుంటున్నాడని ఆరోపించారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని, ఆయన హామీతో కొంతకాలం చేపలు పట్టుకున్నామన్నారు. గత ఎన్నికల సమయంలో ప్రస్తుత దగుమాటి కృష్ణారెడ్డి తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అల్లూరు చెరువును గిరిజనులకు అప్పగిస్తామని చెప్పారన్నారు. పలుమార్లు ఆయన వద్దకెళ్లి సమస్యను చెప్పామన్నారు. చెరువులోకి దిగితే రాఘవులు తమపై దాడులకు దిగుతున్నాడని, అక్రమ కేసులకు కూడా పెట్టిస్తున్నాడని ఆరోపించారు. మత్స్యశాఖ అధికారుల వద్దకు పలుమార్లు వెళ్లి సమస్యను చెప్పామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement