పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించుకోండి | - | Sakshi
Sakshi News home page

పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించుకోండి

Oct 28 2026 1:24 AM | Updated on Oct 28 2026 1:24 AM

నెల్లూరు రూరల్‌: స్థానిక సంస్థల ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బంది తమ ఓటు హక్కును పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా సక్రమంగా వినియోగించుకోవాలని కలెక్టర్‌ హిమాన్షు శుక్లా సూచించారు. నగరంలోని కస్తూర్బా కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన పోస్టల్‌ బ్యాలెట్‌ ఫెసిలిటేషన్‌ సెంటర్‌ను మంగళవారం పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటేసే విధానంపై పూర్తి అవగాహనను కలిగి ఉండాలని సూచించారు. వినియోగించుకునేందుకు గానూ ఎలక్షన్‌ డ్యూటీ ఆర్డర్‌ కాపీ, ఓటరు ఐడీ, ఆధార్‌ కార్డుతో హాజరుకావాలని పేర్కొన్నారు. కమిషనర్‌ నందన్‌, నోడల్‌ అధికారి నాగరాజకుమారి, డీఈఓ బాలాజీరావు, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ కేశవర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బెదిరించి..

విత్‌డ్రా చేయించి

అల్లూరు: మండల పరిధిలోని ఇస్కపల్లి – 2 నుంచి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున నామినేషన్లను కొండూరు భారతి, కొండూరు లక్ష్మి వేశారు. ఈ క్రమంలో విత్‌డ్రా చేయకపోతే గ్రామ కట్టుబాటుగా ఊరి నుంచి వెలేస్తామని ఇస్కపల్లి – 2కు చెందిన కాపులు బెదిరించారు. దీంతో వీరు ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో టీడీపీకి చెందిన ఆవుల కామేశ్వరమ్మ ఏకగ్రీవమయ్యారు.

30న పింఛన్ల

నగదు పంపిణీ

నెల్లూరు(పొగతోట): మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో సామాజిక పింఛన్ల నగదును ఈ నెల 30నే పంపిణీ చేయనున్నామని డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 2,85,842 మంది లబ్ధిదారులకు రూ.125.13 కోట్ల మేర పంపిణీ చేయనున్నామని వెల్లడించారు.

నేను రాజకీయం చేస్తే తట్టుకోలేరు

● ఆనం వర్సెస్‌ బీద

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో టీడీపీ నేతల మధ్య వర్గావిభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. జిల్లా టీడీపీ కార్యాలయం వేదికగా జెడ్పీటీసీల అభ్యర్థులకు బీఫారాలు అందజేసే కార్యక్రమంలో నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఆత్మకూరు నియోజకవర్గానికి చెందిన కన్నబాబు అక్కడికి చేరుకోవడంతో పార్టీకి ద్రోహం చేసే వారిని ఎలా అనుమతిస్తారంటూ ఆత్మకూరు టీడీపీ మండల అధ్యక్షుడు సుంకర పెంచలచౌదరి మండిపడ్డారు. ఈ క్రమంలో కన్నబాబు ఏమి మాట్లాడుతున్నావని ముందుకు రావడంతో టీడీపీ నేతలు వారించే ప్రయత్నం చేశారు. కొద్దిసేపు కార్యాలయంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఆనం రామనారాయణరెడ్డికి ఆయన వర్గీయులు ఫోన్‌ చేసి పరిస్థితిని వివరించారు. దీంతో ఆగమేఘాల మీద కార్యాలయానికి చేరుకున్నారు.

బీద రవిచంద్రపై ఆగ్రహం

ఆనం రామనారాయణరెడ్డి కార్యాలయానికి చేరుకుని జిల్లా టీడీపీ అధ్యక్షుడు బీద రవిచంద్రతోపాటు పార్టీ పరిశీలకులు రాకేష్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలో పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తిని ఎందుకు అనుమతించారని ప్రశ్నించారు. బీజేపీ, జనసేనలోని కొందరితో నామినేషన్లు వేయించారని, వారికి తనకు తెలియకుండా బీఫారాలు ఎలా ఇస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నా వర్గీయులనే బెదిరిస్తారా? తెరచాటు రాజకీయాలు చేయడం సరైన పద్ధతి కాదన్నారు. ఇప్పటి వరకు ఎన్ని జరుగుతున్నా తలదించుకుని వెళుతున్నానని, తలెత్తి రాజకీయాలు చేస్తే తట్టుకోలేరన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement