నీచ రాజకీయాలకు తెరలేపిన బాబు | - | Sakshi
Sakshi News home page

నీచ రాజకీయాలకు తెరలేపిన బాబు

Oct 28 2026 1:24 AM | Updated on Oct 28 2026 1:24 AM

తోటపల్లిగూడూరు: స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవలేక.. ఎలాగైనా అడ్డుకోవాలనే ఉద్దేశంతో నీచ రాజకీయాలకు సీఎం చంద్రబాబు తెరలేపారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మహిళా విభాగ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కాకాణి పూజిత ఆరోపించారు. మండలంలోని బిట్‌ – 1లో మంగళవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికీ వెళ్లి కరపత్రాలను అందజేసి తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అనంతరం ఆమె మాట్లాడారు. ఎన్నికల్లో గెలవాలనే లక్ష్యంతో తమ పార్టీ అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. పార్టీని గెలిపించి టీడీపీ ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. తోటపల్లిగూడూరు మండల జెడ్పీటీసీ అభ్యర్థి కుసుమాంబ, ఎంపీటీసీ అభ్యర్థి అన్నం భారతిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మండల కన్వీనర్‌ ఉప్పల శంకరయ్యగౌడ్‌, మాజీ జడ్పీటీసీ మన్నెం చిరంజీవిగౌడ్‌, మన్నెం సుబ్రహ్మణ్యంగౌడ్‌, శేషమ్మ, సంధ్యారాణి, అన్నం హరిప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement