సంగం: మండలంలోని జెండాదిబ్బ ఎంపీటీసీ అభ్యర్థులుగా టీడీపీ నుంచి పువ్వాడి వేణుబాలు, జనసేన తరఫున అన్నం హేమలత నామినేషన్లేశారు. ఈ క్రమంలో తన మామ కోటయ్యస్వామితో కలిసి సంగం ఎంపీడీఓ కార్యాలయంలో ఆర్వోకు బీ ఫారాన్ని హేమలత అందజేస్తుండగా, టీడీపీకి చెందిన జెండాదిబ్బ నేతలు నరేష్‌నాయుడు, విజయకృష్ణారెడ్డితో పాటు మరికొందరొచ్చారు. ఆర్వో సమక్షంలోనే బీ ఫారాన్ని లాక్కున్నారు. అడ్డుకున్న కోటయ్యస్వామిపై దౌర్జన్యం చేసి దాడికి పాల్పడ్డారు. ఇంత జరుగుతున్నా ఆర్వో నిర్మలాదేవి, బందోబస్తులో ఉన్న పోలీసులు ప్రేక్షకపాత్రకే పరిమితమయ్యారు. తమకు జరిగిన అన్యాయంపై కార్యాలయ బయటున్న ఎస్సై భోజ్యానాయక్‌కు హేమలత, కోటయ్యస్వామి తెలియజేశారు. అయితే అంశాన్ని పార్టీ పెద్దలకు చెప్పుకోమని ఉచిత సలహా ఇచ్చారు. ఆపై జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి నలిశెట్టి శ్రీధర్ మరో బీ ఫారాన్ని తీసుకొచ్చి అభ్యర్థులను తీసుకెళ్లి ఆర్వోకు అందజేశారు.


