● అస్వస్థతకు గురైన
వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి
చేజర్ల: స్థానిక సంస్థ ఎన్నికల నామినేషన్‌ను ఆర్వో ఏకపక్షంగా తిరస్కరించడంతో మడపల్లి ఎంపీటీసీ స్థానానికి వైఎస్సార్‌సీపీ తరఫున నామినేషన్ దాఖలు చేసిన పూనూరు బాలగంగాధర్‌రెడ్డి తీవ్ర మనస్థాపం చెంది అస్వస్థతకు గురయ్యారు. గత ఎంపీటీసీ ఎన్నికల్లో గంగాధర్‌రెడ్డి సతీమణి పూనూరు భారతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం అన్‌రిజర్వుడ్ జనరల్‌కు రావడంతో వైఎస్సార్‌సీపీ తరఫున గంగాధర్‌రెడ్డి నామినేషన్ వేశారు. మంత్రి ఆనం ఆదేశాలతో అధికారులు ఏకపక్షంగా నామినేషన్లను తిరస్కరించారు. ఆదివారం ఆర్డీఓకు అప్పీలు చేసినా తిరస్కరించడంతో గంగాధర్‌రెడ్డి జీర్ణించుకోలేక మనస్థాపానికి గురయ్యారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురవగా కుటుంబ సభ్యులు నెల్లూరులోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు.
7.7 కేజీల గంజాయి స్వాధీనం
కావలి: కావలి రైల్వే స్టేషన్‌లో సోమవారం ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్ నుంచి గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. రైల్లో తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో రెండు బ్యాగుల్లో 15 ప్యాకెట్ల(7.7 కేజీల) గంజాయిని గుర్తించినట్లు చెప్పారు. వాటి విలువ సుమారు 3.5 లక్షల వరకు ఉంటుందని పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో నెల్లూరు రైల్వే సీఐ ఏ సుధాకర్, కావలి, చీరాల ఎస్సైలు కొండయ్య, కే వెంకట్‌రావు, సిబ్బంది పాల్గ్గొన్నారు.


