ఓటమి భయంతో టీడీపీ కుట్రలు | - | Sakshi
Sakshi News home page

ఓటమి భయంతో టీడీపీ కుట్రలు

Oct 27 2026 12:50 AM | Updated on Oct 27 2026 12:50 AM

సీతారామపురం : స్థానిక ఎన్నికల్లో ఓటమి భయంతో టీడీపీ నాయకులు కుట్రలకు తెగబడుతున్నారు. మండల వైఎస్సార్‌సీపీ ఎంపీపీ అభ్యర్థి చింతంరెడ్డి లోకేష్‌రెడ్డిని ఎదుర్కోలేక ఆర్వోపై ఒత్తిడి తెచ్చి నామినేషన్‌ను తిరస్కరింపజేయడమే కాకుండా పోలీసుల ద్వారా అక్రమ కేసు బనాయించారు. మండలంలోని సింగారెడ్డిపల్లి ఎంపీటీసీ స్థానం నుంచి ఎంపీపీ అభ్యర్థి లోకేష్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. ఆయనను తప్పుకోవాలని టీడీపీ నాయకులు ఎన్నో ఒత్తిళ్లకు గురిచేశారు. అయినా వెనకడుగు వేయకపోవడంతో టార్గెట్‌ చేశారు. ఆదివారం రాత్రి మండల పరిషత్‌ కార్యాలయం వద్ద నామినేషన్లను ఆమోదించిన ఎంపీటీసీ అభ్యర్థుల జాబితాను ప్రచురించారు. అందులో తను పేరును తొలగించారనే సమాచారంతో లోకేష్‌రెడ్డి ఎంపీడీఓ కార్యాలయం వద్దకు వచ్చారు. నోటీసు బోర్డులో తన పేరు ఉండడంతో వెనుదిరిగి వెళుతూ తనను అధికార కూటమి నాయకులు ఒత్తిళ్లకు గురిచేస్తూ నానా ఇబ్బందులు పెడుతున్నారని, పిన్నవయసులో రాజకీయాల్లోకి వచ్చిన తనను ఆదరించాలని ఓటర్లను కోరుతూ ఒక వీడియోను చిత్రీకరించారు. ఇదే అదునుగా భావించిన పలువురు కూటమి నాయకులు ఎంపీడీఓ కార్యాలయ అధికార యంత్రాంగంపై ఒత్తిడి తెచ్చి లోకేష్‌రెడ్డిపై పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేయించినట్టు సమాచారం. దీంతో పోలీసులు లోకేష్‌రెడ్డిని అరెస్ట్‌ చేసేందుకు రంగంలోకి దిగడంతో మండల వైఎస్సార్‌సీపీ శ్రేణులు సీతారామపురానికి చేరుకుని ఖండించారు. టీడీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి ఆర్వో తమ అభ్యర్థి పేరును జాబితాలో లేకుండా చేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. కనీసం తిరస్కరణకు గల కారణాలను తెలుపకుండా ఉన్నతాధికారులతో మాట్లాడుకోవాలని పోలీసుల ద్వారా చెప్పించడం విడ్డూరంగా ఉందన్నారు. టీడీపీ నాయకులు ఓ పధకం ప్రకారం తమ అభ్యర్థి నామినేషన్‌ తిరస్కరింపజేశారని ఆందోళన వ్యక్తం చేశారు. కుట్రపూరితంగా నామినేషన్‌ తిరస్కరణపై కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. కాగా ఉదయగిరి సీఐ అంకమ్మరావు ఘటనా స్థలానికి చేరుకుని ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున నిరసనలు చేపట్టకూడ దనడంతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు వెనుదిరిగాయి.

లోకేష్‌రెడ్డిపై అక్రమ కేసు తగదు

వైఎస్సార్‌సీపీ ఎంపీపీ అభ్యర్థి చింతంరెడ్డి లోకేష్‌రెడ్డిపై కుట్రపూరితంగా అక్రమ కేసు బనాయించడాన్ని ఉదయగిరి సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్‌రెడ్డి, యువ నాయకుడు అభినవ్‌రెడ్డి ఖండించారు. సోమవారం వారు అక్రమ కేసు నమోదుపై ఎస్సై వెంకట రాజేష్‌ను ఆరా తీశారు. అధికార కూటమి నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ఆర్వో తొలుత ఆమోదించిన లోకేష్‌రెడ్డి నామినేషన్‌ను ఉద్దేశపూర్వకంగా తిరస్కరించడమే కాకుండా, అతనిపై కేసు నమోదుకు అధికారులు ఫిర్యాదు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ వ్యవహారం వెనుక ఏదో కుట్ర జరిగిందని అర్ధమవుతోందన్నారు. ప్రత్యక్షంగా ఎన్నికల్లో తమ అభ్యర్థిని ఎదుర్కొనే ధైర్యం లేకనే టీడీపీ నాయకులు ఓ పధకం ప్రకారం పేరు తొలగించారని ఆరోపించారు. కుట్రపూరితంగా అక్రమ కేసు బనాయించారని, ఇలాంటి దుశ్చర్యకు పాల్పడిన అధికార యంత్రాంగం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

వైఎస్సార్‌సీపీ ఎంపీపీ అభ్యర్థి నామినేషన్‌ తిరస్కరణ

తొలుత ఆమోదించినట్లు

నోటీసు బోర్డులో పేరు ప్రచురణ

ఆ తరువాత టీడీపీ నేతల

ఒత్తిడితో తొలగించిన ఆర్వో

పోలీసులతో అక్రమ కేసు బనాయింపు

ఖండించిన మేకపాటి రాజగోపాల్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement