‘అధికార’ దుర్వినియోగం | - | Sakshi
Sakshi News home page

‘అధికార’ దుర్వినియోగం

Oct 27 2026 12:50 AM | Updated on Oct 27 2026 12:50 AM

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: స్థానిక సంస్థల పరిషత్‌ ఎన్నికల్లో గెలుపొందేందుకు అధికార పార్టీ అడ్డదారులు తొక్కుతోంది. ఎన్నికల బరిలో ఓ అధికారి సతీమణిని నిలబెట్టి.. ఆమె గెలుపునకు అడ్డుగా ఉన్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని లక్ష్యంగా చేసుకుని వ్యవస్థలతో కలిసి అక్రమ కేసులు బనాయించడం అధికార దుర్వినియోగానికి పరాకాష్టగా నిలుస్తోంది. అధికార పార్టీకి క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఓట్లు అడిగే దమ్ము, ధైర్యం సన్నగిల్లడంతో ప్రతిపక్ష పార్టీలను ఎన్నికల బరిలోకి దిగనీయకుండా అడ్డదారుల్లో ఏకగ్రీవం చేసుకునేందుకు పడరాని పాట్లు పడుతోంది. జిల్లాలో గూడూరు నియోజకవర్గంలో ఈ దాష్టీకం తీవ్రరూపం దాల్చింది. ఇప్పటి వరకు పోలీస్‌ వ్యవస్థే అధికార పార్టీకి ఊడిగం చేస్తుంటే.. తాజాగా ఓ అధికారి తన భార్యను ఎన్నికల బరిలో నిలబెట్టి గెలిపించుకునేందుకు ఏకంగా రెవెన్యూ వ్యవస్థను సైతం తాకట్టు పెట్టారు. గూడూరు నియోజకవర్గం చిట్టమూరు మండలంలో వైఎస్సార్‌సీపీ మండలాధ్యక్షుడు సన్నారెడ్డి శ్రీనివాసులురెడ్డి అరెస్ట్‌ కుట్రల వెనక మూడు వ్యవస్థలు కలిసి పనిచేసినట్లు తెలుస్తోంది. శ్రీనివాసులురెడ్డి తల్లి సన్నారెడ్డి విజయలక్ష్మి వైఎస్సార్‌సీపీ చిట్టమూరు జెడ్పీటీసీ అభ్యర్థి గా ఎన్నికల బరిలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థిగా చిల్లకూరు మండల తహసీల్దార్‌ సతీమణి పెళ్లూరు సౌజన్య బరిలోకి దిగారు. అయితే ఇక్కడ వైఎస్సార్‌సీపీ విజయావకాశాలు మెండుగా ఉన్నాయి. కూట మి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత చిట్టమూరు మండలంలో జరుగుతున్న దోపిడీలు, దౌర్జన్యాలు మితిమీరడంతో ప్రజలు విసిగిపోయి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని ఘోరంగా ఓడిస్తారనే ప్రచారం స్థానికంగా ఊపందుకుంది. ఈ క్రమంలో ప్రత్యర్థులను బరిలోనే లేకుండా చేసేందుకు ఏకంగా స్థానిక ఎమ్మెల్యే సూచనలు మేరకు స్థానిక నాయకులు, పోలీస్‌, రెవెన్యూ అధికారులతో కలిసి ప్రతిపక్ష పార్టీని టార్గెట్‌ చేశారు. టీడీపీ తరఫున ఎన్నికల బరిలో నిలిచిన పెళ్లూరు సౌజన్య భర్త చిల్లకూరు తహసీల్దార్‌ కావడం, ఆయన తిరుపతి జిల్లా రెవెన్యూ అసోసియేషన్‌లో కీలక నేతగా చెలామణి అవుతుండడంతో ఆమెను గెలిపించేందుకు రెవెన్యూ అసోసియేషన్‌ ద్వారా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కుమారుడిని టారె్‌గ్‌ట్‌ చేసే విధంగా పోలీస్‌లపై ఒత్తిడి తెచ్చారని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో పంచాయతీ వార్డు సభ్యుడిగా పోటీ చేయాలనుకునే పోలయ్యతో ఫిర్యాదు చేయించి సన్నారెడ్డి శ్రీనివాసులురెడ్డిపై అక్రమ కేసును బనాయించారు. అధికార పార్టీ నేతల ఒత్తిడితో పోలీసులు శ్రీనివాసులురెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు. ఇదిలా ఉండగా ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీలో చురుగ్గా ఉండే నాయకులను లక్ష్యంగా చేసుకుని తప్పుడు ఫిర్యాదులు చేయించి అరెస్ట్‌ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.

చిట్టమూరు టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థిగా తహసీల్దార్‌ సతీమణి పోటీ

ఆమె గెలుపునకు అడ్డుగా ఉన్న

వైఎస్సార్‌సీపీ అభ్యర్థి

వ్యవస్థల అండతోనే అక్రమ కేసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement