ఫోర్జరీ సంతకాలతో విత్‌డ్రా చేయడం సిగ్గుచేటు | - | Sakshi
Sakshi News home page

ఫోర్జరీ సంతకాలతో విత్‌డ్రా చేయడం సిగ్గుచేటు

Oct 22 2026 3:44 AM | Updated on Oct 22 2026 3:44 AM

● మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి

ఆత్మకూరు: స్థానిక మున్సిపల్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల నామినేషన్లపై ఫోర్జరీ సంతకాలు చేసి విత్‌డ్రా చేయించడం టీడీపీకి సిగ్గుచేటని మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి విమర్శించారు. 10, 24తో పాటు మరికొన్ని వార్డుల్లో నామినేషన్లను ఫోర్జరీ సంతకాలతో విత్‌డ్రా చేయించిన తరుణంలో పట్టణంలోని పార్టీ కార్యాలయంలో పదో వార్డు అభ్యర్థి కోర్సిపాటి ప్రవీణ, పార్టీ పట్టణాధ్యక్షుడు నాగులపాటి ప్రతాప్‌రెడ్డితో కలిసి విలేకరులతో విక్రమ్‌రెడ్డి బుధవారం మాట్లాడారు. నకిలీ విత్‌డ్రా ఫారాలను సమర్పించడం, వాటిని అధికారులు ధ్రువీకరించడంపై ఆయన మండిపడ్డారు. తొలుత సంతకాలు సరిపోలేదని పేర్కొన్న అధికారులు అనంతరం ఉపసంహరణలను ఎలా అంగీకరిస్తారని ప్రశ్నించారు. నకిలీ పత్రాలతో వచ్చిన వ్యక్తులను గుర్తించేందుకు సీసీ ఫుటేజీలను పరిశీలించాలని కలెక్టర్‌ను కోరామన్నారు. ఈ విషయమై కోర్టులో పిటిషన్‌ను దాఖలు చేస్తామని స్పష్టం చేశారు. ఆత్మకూరు చైర్‌పర్సన్‌ స్థానాన్ని బీసీలకు కేటాయించి అభ్యర్థి దొరక్క మార్పించుకున్న ఘనత మంత్రి ఆనం రామనారాయణరెడ్డికే దక్కుతుందని ఎద్దేవా చేశారు. ఓసీ మహిళ సైతం దొరక్కపోవడంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కుటుంబంలో చిచ్చుపెట్టి, తమ పబ్బం గడుపుకొనేలా మంత్రి వ్యవహరించారని మండిపడ్డారు. అభివృద్ధి చేశామని చెప్పుకొనే టీడీపీ నేతలకు అభ్యర్థులే దొరకలేదానని ప్రశ్నించారు.

పాఠశాలల

పునఃప్రారంభం నేడు

నెల్లూరు (టౌన్‌): దసరా సెలవుల అనంతరం జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలు గురువారం పునఃప్రారంభం కానున్నాయి. కాగా జూనియర్‌ కళాశాలలను బుధవారం ప్రారంభించాల్సి ఉన్నా.. కొన్ని కార్పొరేట్‌, ప్రైవేట్‌ యాజమాన్యాలు గురువారం నుంచి నిర్వహించనున్నాయి.

శ్రీవారి దర్శనానికి ఎనిమిది గంటలు

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ బుధవారం సాధారణంగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని తొమ్మిది కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారిని 83,745 మంది మంగళవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 19,391 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.2.99 కోట్లను సమర్పించారు. టైమ్‌ స్లాట్‌ టికెట్లున్న వారికి సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి ఎనిమిది గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లున్న వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement