నామినేషన్‌ కేంద్రం వద్ద దాదాగిరి | - | Sakshi
Sakshi News home page

నామినేషన్‌ కేంద్రం వద్ద దాదాగిరి

Oct 22 2026 3:44 AM | Updated on Oct 22 2026 3:44 AM

కోట: ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో తొలి రోజు టీడీపీ నేతలు గూండాయిజం చేశారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద నామినేషన్లను ఆర్వో పవన్‌కుమార్‌ స్వీకరించారు. అయితే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు నామినేషన్లు వేసేందుకు వీల్లేకుండా అల్లరిమూకలతో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలను అడ్డుకున్నారు. పోలీసులు పూర్తిగా చేతులెత్తేశారు. దీంతో ఎన్వోసీల కోసం వచ్చిన నేతలు ఇబ్బందులు పడ్డారు. ఊనుగుంటపాళేనికి చెందిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి కోటారెడ్డిని టీడీపీ నేతలు అడ్డుకొని పంపేశారు. జెడ్పీటీసీ అభ్యర్థి సుజనప్రియ, ఆమె భర్త సుబ్బారావు వస్తున్న కారును అడ్డుకొని దాడి చేసేందుకు యత్నించడంతో వారిని పోలీసులు రక్షించి స్టేషన్‌కు తరలించారు. నామినేషన్లు వేసేందుకు వీల్లేదని, ఎవరైనా బలవంతంగా వస్తే వారి పత్రాలను చించేస్తామంటూ టీడీపీ నేతలు చిందులేశారు. తొలి రోజు 15 నామినేషన్లు రాగా, అన్నీ టీడీపీవే కావడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement