● డ్రంక్ అండ్ డ్రైవ్ 19, ఎంవీ యాక్ట్ కింద 220 కేసుల నమోదు
నెల్లూరు సిటీ: ఎస్పీ అజిత వేజెండ్ల ఆదేశాలతో 183 మంది పోలీసు అధికారులు, సిబ్బంది గురువారం రాత్రి జిల్లా వ్యాప్తంగా నాకాబందీ నిర్వహించారు. ప్రధాన కూడళ్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, వాణిజ్య సముదాయాలు, జాతీయ రహదారులు, జిల్లా ప్రవేశ, నిష్క్రమణ మార్గాలతోపాటు అనుమానితుల నివాస ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. 33 లాడ్జీలను తనిఖీ చేశారు. బహిరంగ మద్యంపై 7, డ్రంక్ అండ్ డ్రైవ్ కింద 19, మోటారు వాహన చట్టం కింద 220 కేసులు నమోదు చేశారు. మొత్తం రూ.1,29,080ల జరిమానా విధించారు. అసాంఘిక కార్యకలాపాలు, రౌడీయిజం లేదా అనుమానాస్పద కదలికలపై జిల్లా పోలీసు కంట్రోల్ రూమ్ నంబర్ 93929 03143కు సమాచారం ఇవ్వాలని ఎస్పీ సూచించారు.


