చెట్లను నరికేశారు.. కలపను కాజేశారు! | - | Sakshi
Sakshi News home page

చెట్లను నరికేశారు.. కలపను కాజేశారు!

Oct 1 2026 12:11 AM | Updated on Oct 1 2026 12:11 AM

● రోడ్డు విస్తరణ పేరుతో

భారీ వృక్షాల తొలగింపు

● కలపకు బహిరంగ వేలం

వేయకుండా తరలింపు

కావలి: రోడ్డు విస్తరణ పేరుతో కావలి ట్రంక్‌రోడ్డుకు ఇరువైపులా ఏళ్ల తరబడి పచ్చదనం, చల్లదనాన్ని పంచిన భారీ వృక్షాలను తొలగించడంపై స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతున్న వేళ.. నరికిన చెట్ల మొద్దులు, కలపను అనామత్తుగా తరలింపుపై కొత్త ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. రోడ్డుకు ఇరువైపుల ఉన్న భారీ వృక్షాల నుంచి లభించిన కలప ప్రభుత్వ ఆస్తిగా పరిగణించాల్సి ఉంది. అయితే రోడ్డు కాంట్రాక్టర్‌తోపాటు మున్సిపాలిటీ, అటవీశాఖ అధికారులు కుమ్మక్కై.. అత్యంత విలువైన కలపను నిబంధనలకు విరుద్ధంగా నరికివేయడంతోపాటు అక్రమంగా తరలించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కలప విలువ నిర్ధారణ, విక్రయ ప్రక్రియపై పారదర్శకత లేకపోవడంతో స్థానికుల్లో అనుమానాలు రేకెత్తుతున్నాయి. బుధవారం మొద్దులు, కలప లారీల్లో తరలిస్తుండడంతో వాటిని ఎక్కడికి తరలిస్తున్నారు? ఎవరి ఆధ్వర్యంలో తరలిస్తున్నారనే విషయాలపై స్పష్టత లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.

అనుమానాలకు తావెందుకు?

నరికిన చెట్ల కలప విలువ తక్కువేమీ కాదని, భారీ స్థాయిలో కలప తరలిపోతున్న నేపథ్యంలో సంబంధిత అధికారులు పూర్తి వివరాలు వెల్లడించకపోవడం అనుమానాలకు తావిస్తోందని స్థానికులు పేర్కొంటున్నారు. కలప తరలింపులో అధికార పార్టీకి చెందిన కొందరి ప్రమేయం ఉన్నట్లు పట్టణంలో చర్చ జరుగుతోంది. ప్రభుత్వ ఆస్తికి సంబంధించిన వ్యవహారంలో ఎలాంటి సందేహాలకు తావు లేకుండా పూర్తి పారదర్శకత పాటించాల్సిన బాధ్యత అధికారులపై ఉందంటున్నారు. చెట్ల తొలగింపు నుంచి కలప తరలింపు వరకు జరిగిన మొత్తం ప్రక్రియపై ఉన్నతాధికారులు సమగ్రంగా విచారణ చేపట్టి.. వాస్తవాలను ప్రజల ముందుంచాలని వారు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement