మైకా గనుల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

మైకా గనుల పరిశీలన

Oct 1 2026 12:11 AM | Updated on Oct 1 2026 12:11 AM

సైదాపురం: మండలంలోని గిద్దలూరు గ్రామ సమీపంలో ఉన్న రాధాకృష్ణ మైకా గనిని బుధవారం రాష్ట్ర డైరెక్టర్‌ ఆఫ్‌ మైన్స్‌ ఆఫ్‌ జియాలజీ అధికారి డబ్ల్యూబీ చంద్రశేఖర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఆయన జిల్లాలోని సంగం ప్రాంతంలో ఉన్న ఇసుక క్వారీలను చూశారు. రాధాకృష్ణ గనిలో జరుగుతున్న పనులను క్షేత్రస్థాయిలో డీఎంజీ పరిశీలించారు. అక్కడి నుంచి గూడూరు సమీపంలో ఉన్న సిలిగా మైన్‌కు వెళ్లినట్లు తెలిసింది. ఆయన వెంట నెల్లూరు జిల్లా డీఎంజీఓ కె.శ్రీనివాసరావు, గూడూరు ఏడీఏంజీ టి.సుబ్బరాయుడు, మినరల్‌ రెవెన్యూ అధికారి సురేష్‌ కుమార్‌, సూపర్‌వైజర్‌ ఎన్‌.సుధాకర్‌, ఆర్‌ఐ వెంకటేశ్వరరావు ఉన్నారు.

తేనెటీగల దాడిలో

వ్యక్తి మృతి

కోట: తేనెటీగలు కుట్టడంతో తాటితోపు గ్రామానికి చెందిన సూళ్లూరు గురవయ్య (56) మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వారి కథనం మేరకు.. గురవయ్య గూడలిలో మామిడితోట వద్ద కాపలాదారుడిగా పనిచేస్తున్నాడు. బుధవారం తోట వద్ద ఉండగా తేనెటీగలు దాడి చేసి కుట్టినట్లు తెలిపారు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని కోటలోని ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మృతుడికి భార్య, పిల్లలున్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement