గుర్తుతెలియని కారు ఢీకొని.. | - | Sakshi
Sakshi News home page

గుర్తుతెలియని కారు ఢీకొని..

Oct 1 2026 12:11 AM | Updated on Oct 1 2026 12:11 AM

● వ్యక్తి దుర్మరణం

నెల్లూరు సిటీ: రూరల్‌ మండలం మట్టెంపాడు క్రాస్‌రోడ్డు సమీపంలో పొదలకూరు – నెల్లూరు రహదారిపై మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. ఆమంచర్ల గ్రామంలోని సేవాజ్యోతి కాలనీకి చెందిన ఇట్టా వెంకటేశ్వర్లు (44) మోటార్‌బైక్‌పై తన ఇంటికి వెళ్తున్నాడు. పొదలకూరు వైపు నుంచి నెల్లూరు వైపు వేగంగా వస్తున్న గుర్తుతెలియని కారు వెంకటేశ్వర్లు బైక్‌ను ఢీకొట్టింది. దీంతో అతను రోడ్డుపై పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. 108 అంబులెన్స్‌ సిబ్బంది వచ్చి పరిశీలించి అప్పటికే అతను చనిపోయినట్లుగా నిర్ధారించారు. మృతుడి భార్య జ్యోతి రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.

రైల్లోంచి జారిపడి

వ్యక్తి మృతి

నెల్లూరు సిటీ: రైల్లోంచి జారిపడి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల కథనం మేరకు.. వేదాయపాళెం – వెంకటాచలం రైల్వేస్టేషన్ల మధ్య హౌసింగ్‌ బోర్డు కాలనీ సమీపంలో రైలు నుంచి ఓ వ్యక్తి జారిపడి మృతిచెందాడు. మృతుడి వయసు, ఇతర వివరాలు తెలియరాలేదు. బిస్కెట్‌ కలర్‌ హాఫ్‌ హ్యాండ్‌ టీషర్ట్‌, బ్లూ కలర్‌ ప్యాంట్‌ ధరించి ఉన్నాడు. కుడిచేతిపై మనీష్‌ అని పచ్చబొట్టు ఉంది. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 92475 75628 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.

విద్యుత్‌ స్తంభం

పైనుంచి పడి..

● వ్యక్తికి తీవ్ర గాయాలు

వింజమూరు(ఉదయగిరి): వింజమూరులోని ఎంఎస్‌ఆర్‌ డిగ్రీ కళాశాల సమీపంలో విద్యుత్‌ స్తంభాలకు లైట్లు బిగించే క్రమంలో షాక్‌కు గురై పంచాయతీకి చెందిన ఎలక్ట్రీషియన్‌ బండి చంద్ర కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. 11 కేవీ లైన్‌కు విద్యుత్‌ సరఫరా ఉండటంతో లైట్లు బిగించే క్రమంలో పొరపాటున చేయి లైనుకు తగలడంతో బుధవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు అతడిని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తీసుకెళ్లారు.

చెరువులో పడి..

● గుర్తుతెలియని వ్యక్తి మృత్యువాత

గూడూరురూరల్‌: రూరల్‌ పరిధిలోని శారదా నగర్‌ సమీపంలో ఉన్న ఎల్‌ఏపీ స్కూల్‌ వెనుకవైపున ఉన్న గూడూరు చెరువులో పడి ఓ వ్యక్తి మృతిచెందాడు. రూరల్‌ పోలీసుల కథనం మేరకు.. బుధవారం ఉదయం నీటిలో మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై తిరుపతయ్య సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని వెలికి తీయించారు. ఎలాంటి ఆధారాలు లభించలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు. మృతుడి వివరాలు తెలిసిన వారు రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని ఎస్సై కోరారు.

కండలేరులో

17.19 టీఎంసీలు

రాపూరు: కండలేరు జలాశయంలో బుధవారం నాటికి 17.19 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు జలాశయం ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 105, లోలెవల్‌ కాలువకు 10, పిన్నేరు కాలువకు 5, మొదటి బ్రాంచ్‌ కాలువకు 45 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.

నిమ్మ ధరలు

(కిలో)

పెద్దవి : రూ.125

సన్నవి : రూ.90

పండ్లు : రూ.40

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement