ఆర్డీఎస్‌ఎస్‌ పనుల్లో జిల్లా ముందంజ | - | Sakshi
Sakshi News home page

ఆర్డీఎస్‌ఎస్‌ పనుల్లో జిల్లా ముందంజ

Sep 26 2026 11:52 PM | Updated on Sep 26 2026 11:52 PM

వింజమూరు(ఉదయగిరి): రీవ్యాంప్డ్‌ డిస్ట్రిబ్యూషన్‌ సెక్టార్‌ స్కీమ్‌(ఆర్డీఎస్‌ఎస్‌) ద్వారా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 75 శాతం పనులు పూర్తిచేసి రాష్ట్రంలోనే ముందంజలో ఉన్నట్లు సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ పి.సుధాకర్‌ తెలిపారు. ఆయన శనివారం వింజమూరు మండలం చంద్రపడియలో జరుగుతున్న ఆర్డీఎస్‌ఎస్‌ పనులను పరిశీలించి విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలో రూ.832 కోట్ల నిధులతో విద్యుత్‌ మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. ఇప్పటివరకు 75 శాతం పనులు పూర్తికాగా మరో 25 శాతం పనులను 20 ప్రత్యేక బృందాల ద్వారా యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రస్తుతం 21,280 కిలోమీటర్ల కండక్టర్‌, రెండు లక్షల విద్యుత్‌ పోల్స్‌తో పనులు చేపట్టామన్నారు. పారిశ్రామిక అభివృద్ధి కోసం ప్రతి గ్రామానికి త్రీఫేజ్‌ విద్యుత్‌ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట కన్‌స్ట్రక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ కె.పరంధామయ్య ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement