సచివాలయం చుట్టూ వారం రోజులుగా తిరుగుతున్నా. నా భర్త మరణానంతరం రేషన్ కార్డులో ఆయన పేరును తొలగించలేదని, దీంతో వితంతు పింఛన్ మంజూరు కావడం సాధ్యం కాదని సిబ్బంది చెప్పారు. మేము గిరిజనులం. తొలగించే విధానం తెలీదు. తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరగ్గా, రేషన్ కార్డులో పేరును తొలగిస్తామన్నారు. 21 రోజుల అనంతరం ఈ ప్రక్రియ పూర్తయి కొత్త కార్డు ఇస్తారనే అంశం తెలిసింది. అప్పటికి పింఛన్ దరఖాస్తు గడువు ముగిసిపోతుంది. ఇక మంజూరు కావడం గగనమే. ఈ విషయంలో అధికారులు సాయం చేయాలి.
– యాకసిరి పోలమ్మ, తిరుమనతిప్ప, సంగం మండలం


