వైద్యాధికారిపై ఆరోపణలు అవాస్తవం | - | Sakshi
Sakshi News home page

వైద్యాధికారిపై ఆరోపణలు అవాస్తవం

Aug 20 2026 12:05 AM | Updated on Aug 20 2026 12:05 AM

బుచ్చిరెడ్డిపాళెం: జొన్నవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్‌ అహ్మద్‌బాబుపై సీహెచ్‌ఓ శివప్రియ చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని వైద్య సిబ్బంది తెలిపారు. ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, ఇతర సిబ్బంది పీహెచ్‌సీలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. అహ్మద్‌బాబు సిబ్బందితో అమర్యాదగా ప్రవర్తించలేదన్నారు. శివప్రియ కొంతకాలంగా విధులకు సక్రమంగా హాజరుకాకపోవడంతోపాటు తోటి సిబ్బంది, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లతో దురుసుగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు. విధుల విషయంలో వైద్యాధికారి ప్రశ్నించడం సాధారణ పరిపాలనా చర్యల్లో భాగమేనని తెలిపారు. వైద్యాధికారిపై ఉన్నతాధికారులకు ఇచ్చిన ఫిర్యాదులపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను గుర్తించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement