● గుర్తుతెలియని వ్యక్తి మృతి
నెల్లూరు(క్రైమ్): రోడ్డు దాటుతున్న గుర్తుతెలియని వ్యక్తిని ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందిన ఘటన నెల్లూరులో చింతారెడ్డిపాళెం క్రాస్‌రోడ్డు సమీపంలో చైన్నె వైపు వెళ్లే రహదారిపై గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న నార్త్ ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వయస్సు 50 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండొచ్చని భావిస్తున్నారు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించారు. 13/1వార్డు వీఆర్వో చిన్న ధనయ్య ఫిర్యాదు మేరకు ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 94407 00095, 98856 67799, 94414 44399 ఫోన్ నంబర్లకు సమాచారం అందించాలని నార్త్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ కోరారు.


