కాకాణికి మరోసారి నోటీసులు | - | Sakshi
Sakshi News home page

కాకాణికి మరోసారి నోటీసులు

Feb 21 2026 6:57 AM | Updated on Feb 21 2026 6:57 AM

కాకాణికి మరోసారి నోటీసులు

కాకాణికి మరోసారి నోటీసులు

నెల్లూరు రూరల్‌: నగరంలోని మాజీ మంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి నివాసానికి పోలీసులు శుక్రవారం మరోసారి వెళ్లి నోటీసులను అందజేశారు. నెల్లూరు రూరల్‌ డీఎస్పీ కార్యాలయంలో విచారణకు ఈ నెల 24న హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. వాస్తవానికి కోవూరు స్టేషన్‌కు ఈ నెల 14న హాజరుకావాలంటూ నోటీసులను అక్కడి పోలీసులు జారీ చేశారు. అయితే ఆ రోజు వద్దని, 19న ఇంటి వద్దే విచారిస్తామంటూ నోటీసులిచ్చారు. తీరా ఆ రోజున ఉదయం పది నుంచి మధ్యాహ్నం 12 వరకు నిరీక్షించినా, ఖాకీలు రాలేదు. తాజాగా 24న విచారణకు హాజరుకావాలని, ఒకవేళ ఏదైనా పనులుంటే మరో తేదీని సూచించాలని కాకాణిని కోరారు. అయితే వీటికి తాను భయపడేదిలేదని, విచారణకు హాజరవుతానని ఆయన చెప్పారు.

వైఎస్సార్సీపీలో

పలువురికి పదవులు

నెల్లూరు రూరల్‌: జిల్లాకు చెందిన పలువుర్ని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో వివిధ హోదాల్లో నియమిస్తూ ఉత్తర్వులను పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం జారీ చేసింది. ఎస్సీ సెల్‌ రాష్ట్ర జాయింట్‌ సెక్రటరీగా కావలి నియోజకవర్గానికి చెందిన దాసరి శివాజీ, జిల్లా ఆర్గనైజేషనల్‌ సెక్రటరీగా నీలపరెడ్డి హరిప్రసాద్‌రెడ్డి, ఆత్మకూరు నియోజకవర్గ యువత అధ్యక్షుడిగా డాక్టర్‌ ప్రణీత్‌, ఎస్సీ సెల్‌ నియోజకవర్గ అధ్యక్షురాలిగా కమతం శోభ, విద్యార్థి విభాగ ఆత్మకూరు నియోజకవర్గ అధ్యక్షుడిగా బొర్రా విష్ణువర్ధన్‌రెడ్డి, నియోజకవర్గ అంగన్‌వాడీ వింగ్‌ అధ్యక్షురాలిగా గోపిరెడ్డి పద్మను నియమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement