ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువకుడి మృతి

Feb 22 2026 7:04 AM | Updated on Feb 22 2026 7:04 AM

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువకుడి మృతి

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువకుడి మృతి

నెల్లూరు సిటీ: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువకుడు చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. పోలీసుల వివరాల మేరకు.. కోవూరు మండలంలోని పోతిరెడ్డిపాళేనికి చెందిన నాగరాజు కుమారుడు నిఖిల్‌(24) నారాయణ ఆస్పత్రిలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నారు. ఈనెల 2వ తేదీ రాత్రి నెల్లూరు రూరల్‌ పరిధిలోని పద్మావతి గ్రీన్‌ సిటీలో నిఖిల్‌ మద్యంలో విషద్రావణాన్ని కలుపుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు గమనించి అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వారు నిఖిల్‌ను ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చేర్పించారు. దాదాపు 19 రోజుల పాటు చికిత్స పొందుతున్న యువకుడు శనివారం మృతిచెందారు. ఈ ఘటనపై రూరల్‌ పోలీసులకు మృతుడి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. అయితే ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement