23 నుంచి సైన్స్ సమగ్ర మహోత్సవం
నెల్లూరు (టౌన్): జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని సైన్స్ సమగ్ర మహోత్సవంలో భాగంగా సైన్స్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఈ నెల 23 నుంచి నిర్వహించనున్నామని డీఈఓ బాలాజీరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపా రు. ఇండియా, ఆసియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సాధించే దిశగా కార్యక్రమం జరగనుందని వివరించారు. జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకు చదువుతున్న ముగ్గురు విద్యార్థులు టీమ్‌గా ఏర్పడి గైడ్ టీచర్ సాయంతో మోడల్‌ను రూపొందించాలని కోరారు. పాల్గొనాలనుకునే వారు తమ ఆలోచనలను ఈ నెల 22లోపు రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. ప్రతి పాఠశాల నుంచి గరిష్టంగా పది టీమ్‌లు పాల్గొనవచ్చని చెప్పారు. పాఠశాల స్థాయిలో ఈ నెల 23న.. మండల స్థాయిలో 24, 25న.. జిల్లా స్థాయిలో ప్రదర్శనను 26న నిర్వహించనున్నారని వివరించారు. ప్రతి జిల్లా నుంచి రెండు ప్రాజెక్టులను ఎంపిక చేయనున్నామని వెల్లడించారు. ప్రతి జిల్లా నుంచి ఒక ప్రాజెక్టు లేదా మోడల్‌ను ఎంపిక చేసి.. బహుమతులు, సర్టిఫికెట్లను సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేశ్ ఈ నెల 28న అందజేయనున్నారని తెలిపారు.
యరటపల్లి కుటుంబానికి
ప్రసన్న పరామర్శ
చిల్లకూరు: మండలంలోని తీర ప్రాంతంలో ఉన్న వరగలి గ్రామానికి చెందిన యరటపల్లి కుటుంబాన్ని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రన్నకుమార్‌రెడ్డి పరామర్శించారు. గూడూరు ఏఎంసీ మాజీ చైర్మన్ యరటపల్లి జానకిరామిరెడ్డి ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అందుబాటులో లేని కారణంగా వరగలి గ్రామానికి ప్రసన్నకుమార్‌రెడ్డి గురువారం చేరుకొని జానకిరామిరెడ్డి కుమారుడు చరణ్‌కుమార్‌రెడ్డితో పాటు కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రసన్న మాట్లాడారు. తన తండ్రి శ్రీనివాసులురెడ్డితో జానకిరామిరెడ్డి సన్నిహితంగా ఉండే వారిని, యరటపల్లి కుటుంబంతో తమకు మంచి సంబంధాలు ఏర్పడ్డాయని గుర్తుచేసుకున్నారు. పార్టీ నేతలు కలువ బాలశంకర్‌రెడ్డి, కాటంరెడ్డి దినేష్‌రెడ్డి, వేమారెడ్డి మురళీమోహన్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, శరత్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కాకాణిని కలిసిన రామిరెడ్డి
నెల్లూరు రూరల్: మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డిని నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి మర్యాదపూర్వకంగా గురువారం కలిశారు. కావలిలో ఈ నెల 23న నిర్వహించనున్న కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ఆయ న్ను ఆహ్వానించారు.
విమానాశ్రయ భూముల
నష్టపరిహారంపై విచారణ
దగదర్తి: దగదర్తి విమానాశ్రయ భూముల నష్టపరిహారంపై దామవరం పంచాయతీ కార్యాలయంలో విచారణను కావలి ఆర్డీఓ వంశీకృష్ణ నిర్వహించారు. భూ సేకరణకు సంబంధించి సర్వే నంబర్ 1 / 1 లో సుమారు 418 ఎకరాల్లో గుర్తించిన లబ్ధిదారుల్లో అర్హులను గుర్తించేందుకు గానూ దీన్ని జరిపారు. మిగిలిన వారిని విచారించేందుకు గానూ మరోసారి సభను నిర్వహించనున్నామని వెల్లడించారు. ఎకరాకు రూ.13 లక్షల పరిహారాన్ని అందించేందుకు ఉత్తర్వులను ప్రభుత్వం ఇటీవల జారీ చేసింది. భూసేకరణను త్వరలోనే పూర్తి చేసి పరిహారాన్ని అందజేయనున్నామని ప్రకటించారు. తహసీల్దార్ లాజరస్, ఆర్‌ఐ ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.
23 నుంచి సైన్స్ సమగ్ర మహోత్సవం
23 నుంచి సైన్స్ సమగ్ర మహోత్సవం


