పిల్లలకు మాత్రలు అందించాలి
● కలెక్టర్ హిమాన్షు శుక్లా
నెల్లూరు(అర్బన్): పిల్లల ఆరోగ్య సంరక్షణ, ఎదుగుదలకు నులిపురుగల నివారణ మాత్రలను తప్పనిసరిగా అందించాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. జాతీయ నులిపురుగుల నివారణ దినం సందర్భంగా జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో మంగళవారం నెల్లూరులోని ఈఎస్‌ఆర్‌ఎం హైస్కూల్ విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను అందించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న కలెక్టర్ పలువురు విద్యార్థుల చేత మాత్రలను మింగించారు. ఆయన మాట్లాడుతూ పిల్లల్లో నులిపురుగులు చేరడం వల్ల రక్తహీనతకు గురై నీరసిం పోతారన్నారు. ఈరోజు మాత్రలు వేసుకోని పిల్లలను గుర్తించి 24న వారికి అందించాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ సుజాత, ప్రోగ్రాం కో ఆర్డినేటర్ డాక్టర్ యశ్వంత్, డెమో అధికారి కనకరత్నం తదితరులు పాల్గొన్నారు.
5,35,499 మందికి..
జిల్లాలో నిర్వహించిన ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమం విజయవంతమైందని డీఎంహెచ్‌ఓ డాక్టర్ వి.సుజాత తెలిపారు. నగరంలోని పలు పాఠశాలల్లో కార్యక్రమాన్ని ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక్క రోజే 5,35,499 మందికి మాత్రలను మింగించామన్నారు. 93 శాతం నమోదైనట్లు చెప్పా రు. మిగిలిన వారి చేత ఈనెల 24న మాత్రలు మింగిస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సహకరించిన విద్యాశాఖ, సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ, వైద్యసిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.


