నేదురుమల్లి జనార్దనరెడ్డి ఆశయాలు కొనసాగిస్తాం | - | Sakshi
Sakshi News home page

నేదురుమల్లి జనార్దనరెడ్డి ఆశయాలు కొనసాగిస్తాం

Feb 21 2026 7:05 AM | Updated on Feb 21 2026 7:05 AM

నేదుర

నేదురుమల్లి జనార్దనరెడ్డి ఆశయాలు కొనసాగిస్తాం

రామ్‌కుమార్‌రెడ్డి

కోట: ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రి దివంగత నేదురుమల్లి జనార్దనరెడ్డి ఆశయాలను కొనసాగిస్తామని ఎన్‌బీకేఆర్‌ విద్యాసంస్థల కరస్పాండెంట్‌, నేదురుమల్లి ఫౌండేషన్‌ చైర్మన్‌ రామ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. జనార్దనరెడ్డి 91వ జయంతిని శుక్రవారం విద్యానగర్‌లో ఘనంగా నిర్వహించారు. నేదురుమల్లి సుబ్బరామిరెడ్డి కళాభవన్‌లో జనార్దనరెడ్డి చిత్రపటానికి ఆయన తనయులు నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, గౌతమ్‌రెడ్డి, ఇంకా అభిమానులు, వైఎస్సార్‌సీపీ నాయకులు, ఎన్‌బీకేఆర్‌ విద్యాసంస్థల అధ్యాపకులు, సిబ్బంది నివాళులర్పించారు. అనంతరం ఫౌండేషన్‌ ఆద్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. విద్యార్థులు, యువత స్వచ్ఛందంగా పాల్గొన్నారు. నెల్లూరు రెడ్‌క్రాస్‌ బ్లడ్‌బ్యాంక్‌, నోవా బ్లడ్‌బ్యాంక్‌, గూడూరు గవర్నమెంట్‌ ఏరియా హాస్పిటల్‌ బ్లడ్‌బ్యాంక్‌, మెడీప్లస్‌ బ్లడ్‌బ్యాంక్‌ సిబ్బంది దాతల నుంచి 682 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. అనంతరం రామ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ సమాజానికి ఉపయోగపడేలా సేవా కార్యక్రమాలను చేపడతామన్నారు. ఎన్‌బీకేఆర్‌ విద్యాసంస్థలతో జనార్దనరెడ్డికి ఎనలేని అనుబంధం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొడవలూరు భక్తవత్సలరెడ్డి, షనీల్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, విజయకుమార్‌రెడ్డి, కోడూరు కల్పలత, మీరారెడ్డి, రేష్మ, హరీష్‌ చంద్రారెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు కోటయ్య పాల్గొన్నారు.

నేదురుమల్లి జనార్దనరెడ్డి ఆశయాలు కొనసాగిస్తాం 1
1/1

నేదురుమల్లి జనార్దనరెడ్డి ఆశయాలు కొనసాగిస్తాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement