సైనిక సంక్షేమానికి రూ.1.30 లక్షల విరాళం
నెల్లూరు(దర్గామిట్ట): సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని పురస్కరించుకుని డీసీఓ బి.గుర్రప్ప ఆధ్వర్యంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, సహకార శాఖ సిబ్బంది సంయుక్తంగా సైనిక సంక్షేమ నిధికి రూ.1.30 లక్షలు వితరణ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో బుధవారం కలెక్టర్, జిల్లా సైనిక బోర్డు చైర్మన్ హిమన్షు శుక్లాకు మెగా చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సాయుధ దళాల పతాక దినోత్సవ నిధి కింద వచ్చిన మొత్తాన్ని యుద్ధంలో మరణించిన వీర సైనికుల కుటుంబాలకు, మాజీ సైనికులు, గాయపడిన సైనికుల సంక్షేమానికి వినియోగిస్తారని తెలిపారు. జేసీ వెంకటేశ్వర్లు, జిల్లా సైనిక సంక్షేమాధికారి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.


