వైఎస్సార్ టీఏ క్యాలెండర్ ఆవిష్కరణ
నెల్లూరురూరల్: రాంజీ నగర్‌లోని వైఎస్సార్‌సీపీ నగర నియోజకవర్గ కార్యాలయంలో వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్, వాల్ స్టిక్కర్, సీఎల్ బుక్స్‌ను ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి బుధవారం ఆవిష్కరించారు. నూతన సంవత్సరంలో వైఎస్సార్‌టీఏ మరింత బలోపేతం దిశగా నేతలు కృషి చేయాలని చంద్రశేఖర్‌రెడ్డి ఆకాంక్షించారు. ఉపాధ్యాయులకు అండగా ఉంటూ వారి సమస్యలపై అలుపెరుగని పోరాటం సాగించాలని సూచించారు. వైఎస్సార్ టీఏ రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు పాల్గొన్నారు.


