‘ఎమ్మెల్యే సార్.. మీ రోడ్డు సూపర్’
‘వర్షం కురిస్తే నెల్లూరు నగరంలోని రామలింగాపురం రైల్వే అండర్ బ్రిడ్జి రోడ్డు చెరువును తలపించేది. నీళ్లు నిలిచేవి, డ్రెయినేజీ పారేది కాదు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ‘అత్యాధునిక టెక్నాలజీ’తో చుక్క నీరు నిలవకుండా డ్రెయిన్, సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టారంటూ కొద్ది నెలల క్రితం సోషల్ మీడియాలో భజన రీల్స్, పోస్టులు వైరలయ్యాయి. ‘ఎమ్మెల్యే సార్.. సూపర్’ అంటూ లైక్స్, షేర్స్‌తో ముంచెత్తారు. దాదాపు రెండునెలలపాటు రోడ్డును బ్లాక్ చేసి, రూ.1.17 కోట్లు ఖర్చు పెట్టి.. అత్యాధునిక టెక్నాలజీతో ‘అద్భుత డ్రెయినేజీ పారుదల’ నిర్మాణం చేపట్టామంటూ గప్పాలు కొట్టుకున్నారు. అండర్ బ్రిడ్జి రోడ్డును చూస్తే విదేశీ ఇంజినీర్లు సైతం ఆశ్చర్యపోతారన్నంతగా కూటమి నేతలు హడావుడి చేశారు. రూ.కోట్లు ఖర్చు పెట్టి.. వాహనచోదకులపై బురద చిల్లించే రీతిలో ప్రస్తుత పరిస్థితి ఉంది. ఆ రోడ్డులో ప్రయాణించే వారు పడుతున్న కష్టాలు వర్ణనాతీతం. డ్రెయినేజీ, బురద చేరడంతో ఫీట్లు చేస్తూ రాకపోకలు సాగిస్తున్న పరిస్థితిని చూసి.. అద్భుతో అద్భుతః.. అంటూ నెల్లూరు ప్రజలు వెటకారాన్ని జోడించి విమర్శలు గుప్పిస్తున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరు
‘ఎమ్మెల్యే సార్.. మీ రోడ్డు సూపర్’
‘ఎమ్మెల్యే సార్.. మీ రోడ్డు సూపర్’
‘ఎమ్మెల్యే సార్.. మీ రోడ్డు సూపర్’
‘ఎమ్మెల్యే సార్.. మీ రోడ్డు సూపర్’


