‘సౌండ్’బాబులపై కన్నెర్ర
● అధిక శబ్దం వచ్చే సైలెన్సర్ల తొలగింపు
నెల్లూరు(క్రైమ్): కొంతమంది వాహనదారులు అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లను మోటార్‌బైక్‌లకు ఏర్పాటు చేసుకుని యథేచ్ఛగా తిరుగుతున్నారు. దీంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో నార్త్ ట్రాఫిక్ పోలీసుల శుక్రవారం నెల్లూరు ముత్తుకూరు గేటు సెంటర్ వద్ద స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లను తొలగించి ఒరిజినల్ వాటిని దగ్గరుండి ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీసు అధికారులు మాట్లాడుతూ ప్రజలకు, తోటి వాహనచోదకులకు అసౌకర్యం కలిగిస్తూ శబ్ద కాలుష్యానికి కారణమయ్యే సైలెన్సర్లు వినియోగిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. వాహనాలకు కంపెనీ ఇచ్చిన సైలెన్సర్లు తొలగించి వేరేవి బిగిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. పెద్ద శబ్దం వచ్చే సైలెన్సర్లు విక్రయించేవారు, వాటిని బిగించే మెకానిక్‌లపై సైతం చర్యలు తప్పవని హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని సూచించారు.
‘సౌండ్’బాబులపై కన్నెర్ర
‘సౌండ్’బాబులపై కన్నెర్ర
‘సౌండ్’బాబులపై కన్నెర్ర


