పెన్నానదిలో అక్రమంగా ఇసుక తవ్వకాలు
నెల్లూరు(వీఆర్సీసెంటర్): అనుమతి లేకుండా పెన్నానదిలో యంత్రాలతో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. కొందరు అక్రమార్కులు నిత్యం ట్రాక్టర్లలో రవాణా చేస్తున్నారు. నెల్లూరు నగరంలోని 54వ డివిజన్ పరిధిలో భగత్‌సింగ్ కాలనీ వద్ద పెన్నానది నుంచి నిబంధనలకు విరుద్ధంగా తవ్వుతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారు. పదిరోజుల నుంచి యంత్రాలతో రోజుకు 300 ట్రాక్టర్లకు పైగా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. శుక్రవారం అక్కడికి సీపీఎం నాయకులు నాగేశ్వరరావు, అల్లాభక్షు వెళ్లి తవ్వకాలను అడ్డుకున్నారు. ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు.


