ఎన్నో సంవత్సరాల క్రితం ఓ ట్రస్ట్‌కు ప్రభుత్వం భూములు కే
● ట్రస్ట్ భూముల్లో
జామాయిల్ చెట్ల నరికివేత
● గురువారం కూడా అడ్డుకున్న గ్రామస్తులు
● నిర్వాహకులపై ఆగ్రహం
కలిగిరి: మాగుంట రాఘవరెడ్డి చారిటబుల్ ట్రస్ట్‌కు ఇచ్చిన భూముల్లో జామాయిల్ మొక్కల తొలగింపు, చదును, ప్రహరీ నిర్మాణ పనులను గురువారం స్థానిక జిర్రావారిపాళెం గ్రామస్తులతోపాటు కలిగిరివాసులు కూడా అడ్డుకున్నారు. 1995లో కలెక్టర్ సిఫార్సు మేరకు కలిగిరి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 1012లో 4.02 ఎకరాలను మాగుంట రాఘవరెడ్డి చారిటబుల్ ట్రస్ట్‌కు కళాశాల నిర్మాణానికి కేటాయించారు. అనంతరం 4.02 ఎకరాల్లో 80 సెంట్ల భూమిని శ్మశానానికి కేటాయించారు. ప్రస్తుతం సర్వే నంబర్ 1012–1లో 3.22 ఎకరాలు ట్రస్ట్ పేరుపై ప్రభుత్వ భూమిగా నమోదై ఉంది. ట్రస్ట్ తరఫున ఆ భూముల్లో జామాయిల్‌ను సాగు చేస్తున్నారు. ఈ భూమి జాతీయ రహదారిని ఆనుకుని ఉండటంతో ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఈ నేపథ్యంలో భూములను రూ.4.60 కోట్లకు అమ్మకాలు జరపడానికి చూస్తున్నారని విమర్శలొచ్చాయి. దీనికి బలం చేకూరుస్తూ ఆగస్టు 30వ తేదీన వింజమూరు మండలానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు జామాయిల్ మొక్కలు తొలగించడానికి ప్రయత్నించాడు. గ్రామస్తులు వ్యతిరేకించండంతో ఆ ప్రయత్నాలు నిలిచిపోయాయి.
గ్రామస్తుల ఆగ్రహం
బుధవారం రాత్రి భారీ యంత్రాలతో జామాయిల్ చెట్లను తొలగించడానికి పనులు మొదలు పెట్టారు. గ్రామస్తులు అడ్డుకోవడంతో ఆపేశారు. మళ్లీ గురువారం చెట్లను తొలగించడం.. ప్రహరీ నిర్మాణమంటూ ఐరన్‌ను తీసుకురావడంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చెట్లను తొలగిస్తున్న వాహనాన్ని పొలంలో నుంచి బయటకు పంపారు. ట్రస్ట్ అడ్వైజర్ కృష్ణారెడ్డి వచ్చి రైతులతో మాట్లాడారు. పొలం అమ్మడం లేదని, ప్రహరీ నిర్మాణం మాత్రమే చేపడుతున్నామని చెప్పారు. దీంతో రైతులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇప్పటి వరకు సాగులో ఉన్న జామాయిల్ మీరు కొట్టుకుంటున్నారు. ఒక్క సెంటు భూమి కూడా ఆక్రమణకు గురవ్వలేదు. హడావుడిగా ప్రహరీ నిర్మించాల్సిన అవసరం ఏంటి?, చెట్లను ఎందుకు తొలగిస్తున్నారని నిలదీశారు. మీతో తిరిగే వాళ్లే పొలం కొనుగోలు చేశామని చెబుతున్నారు. మీరేమో అమ్మలేదంటున్నారు. పొంతన లేని సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఏంటని అడిగారు. ట్రస్ట్ పేరుతో బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా ప్రయోజనార్థం పనులకు అయితే అంగీకరిస్తాం గానీ అమ్మకాలు జరపడానికి ఉపేక్షించమన్నారు. ఇక్కడ జరుగుతున్న విషయాలు అన్ని ట్రస్ట్ పెద్దలకు తెలుసా అని నిలదీశారు. గ్రామస్తుల వ్యతిరేకతతో పనులు నిలిపివేశారు.
ఉద్యమం చేస్తాం
నిబంధనలను వ్యతిరేకించి ట్రస్ట్ భూములను అమ్మకాలు జరిపితే సహించం. ప్రహరీ నిర్మాణానికి ఈ స్థాయిలో జామాయిల్ తొలగించాల్సిన అవసరం లేదు. భూములు అన్యాక్రాంతం అయితే తీవ్రస్థాయిలో ఉద్యమం చేస్తాం.
– నోటి బుజ్జిరెడ్డి, జిర్రావారిపాళెం
ఎంపీ మాగుంటకు తెలుసో.. లేదో
ట్రస్ట్ భూముల్లో జరుగుతున్న వ్యవహారం ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి తెలుసో.. లేదో అని అనుమానంగా ఉంది. ట్రస్ట్ తరఫున వస్తున్న వ్యక్తి మమ్మల్ని ఒంగోలులో ఎంపీ కార్యాలయానికి వచ్చి సమస్యను పరిష్కరించుకోమనడంలో మతలబు ఏమిటో అర్థం కావడం లేదు. భూములను ప్రజాప్రయోజన కార్యక్రమాలకు వినియోగించాలి.
– బొర్రా మాల్యాద్రిరెడ్డి, జిర్రావారిపాళెం
ఎన్నో సంవత్సరాల క్రితం ఓ ట్రస్ట్‌కు ప్రభుత్వం భూములు కే
ఎన్నో సంవత్సరాల క్రితం ఓ ట్రస్ట్‌కు ప్రభుత్వం భూములు కే
ఎన్నో సంవత్సరాల క్రితం ఓ ట్రస్ట్‌కు ప్రభుత్వం భూములు కే
ఎన్నో సంవత్సరాల క్రితం ఓ ట్రస్ట్‌కు ప్రభుత్వం భూములు కే


